ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యలలో గుండె సమస్యలు కూడా ఒకటి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్ధాలు తీసుకుంటూ ఉండాలి. గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి గుండె ఆరోగ్యానికి ఎటువంటి ఆహార పదార్థాలు మేలు చేస్తాయి అని చూసుకుని దానికి తగ్గట్టుగా డైట్ మార్చుకుంటే గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.
గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్ధాలు:
ఫైబర్:
ఫైబర్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను రెగ్యులర్ డైట్ లో తీసుకోండి దీనితో గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవుతుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ డైట్ లో తీసుకోవడం వల్ల ఇంఫ్లమేషన్ తగ్గుతుంది బ్లడ్ క్లాటింగ్ వంటివి తగ్గుతాయి. కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది.
ఫోలేట్:
ఇది కూడా గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఫోలేట్ ని తీసుకోవడం వల్ల స్ట్రోక్ యొక్క రిస్కు 12 శాతం తగ్గుతుంది.
మెగ్నీషియం:
మెగ్నీషియం సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను కూడా తీసుకుంటూ ఉండండి. నరాల ఆరోగ్యానికి, మజిల్ ఫంక్షన్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని బాగా ఉంచుతుంది. బీపీని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మంచి ఆహారాన్ని తీసుకుంటే గుండె పనితీరు మెరుగు పడుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. వీటితో పాటుగా మోనోఅన్శాచురేటెడ్ ఫ్యాట్స్, లైకోపిన్ తీసుకుంటూ ఉండండి దీంతో గుండె ఆరోగ్యం బాగుంటుంది. మీరు మరింత ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి.