వ్యాయామంతో అరవై శాతం ఏంగ్జైటీ తగ్గుతుంది..!

-

ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో వ్యాయామం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు వారి యొక్క సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఈజీగా తగ్గించుకోవచ్చు. తాజాగా చేసిన స్టడీ ప్రకారం రెగ్యులర్ గా వ్యాయామం చేసే వాళ్ళల్లో యాంగ్జైటీ చాలా తక్కువగా ఉంటుందని…. సుమారు 60 శాతం వరకు ఎంగ్జైటీని తగ్గించచ్చు అని తెలుస్తోంది. నిజంగా రోజూ వ్యాయామం చేయడం వల్ల భవిష్యత్తులో సమస్యలు రావు. వాకింగ్ చేయడం లేదా ఆడడం ఇలా ఏదైనా చేయొచ్చు.

 

Anxiety

యాంగ్జైటీ డిజార్డర్: ప్రపంచవ్యాప్తంగా పది శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఈ సమస్యకు గురవుతున్నారు. అయితే ఈ యాంగ్జైటీ తగ్గించుకోవడానికి వ్యాయామం బాగా పని చేస్తుందని.. ఫిట్ గా ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. ఈ స్టడీలో 4 లక్షల మందిని తీసుకుని రీసెర్చ్ చేశారు. ఫిజికల్లీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటే 60 శాతం వరకు ఎంగ్జైటీని తగ్గించచ్చు.

అయితే ఏది ఏమైనా సాధారణంగా పరిశీలించి చూస్తే సాధారణ మహిళల కంటే ఫిజికల్లీ యాక్టివ్ గా ఉండే వాళ్లలో యాంగ్జైటీ తక్కువగా ఉంది కాబట్టి వ్యాయామం వల్ల ఎంతో ఉపయోగకరంగా దీని ద్వారా మనకు తెలిసింది. కనుక మీకు ఉండే కాస్త సమయంలో వ్యాయామం కోసం కాస్త సమయాన్ని వెచ్చించండి.

రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. పైగా మనకి తెలియకుండానే ఎన్నో అనారోగ్య సమస్యలకు మనం చెక్ పెట్టుకోవచ్చు. ఇలా చెప్పుకుపోతే వ్యాయామం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి రోజూ కాస్త సమయాన్ని వ్యాయామం కోసం వెచ్చించి తద్వారా ఎన్నో సమస్యల నుండి బయట పడండి.

Read more RELATED
Recommended to you

Latest news