రేగు పండ్ల వలన ఇన్ని లాభాలా..? ఈ సమస్యలన్నీ దూరమే..!

-

రేగు పండ్లు శీతాకాలంలో మనకి దొరుకుతూ ఉంటాయి. రేగు పండ్లుని తీసుకుంటే చక్కటి లాభాలని పొందొచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. విటమిన్ సి, విటమిన్ ఏ, పొటాషియం, ఏమైనా యాసిడ్స్, ఫైబర్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇక మరి వీటిని తీసుకుంటే ఎటువంటి లాభాలని పొందొచ్చు..? ఏఏ సమస్యలకి దూరంగా ఉండొచ్చు అనే విషయాలను తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

రేగు పండ్లను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇందులో ఉండే విటమిన్ సి తెల్ల రక్త కణాలు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ నుండి కూడా దూరంగా ఉండొచ్చు. జలుబు ఫ్లూ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.

యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి:

వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి వీటిని తీసుకుంటే ఫ్రీ రాడికల్స్ కారణంగా శరీరం దెబ్బ తినకుండా చూస్తుంది.

జీర్ణ సమస్యలు ఉండవు:

రేగు పండ్లని తింటే జీర్ణ సమస్యలు కూడా ఉండవు. ఇది ప్రోబయోటిక్ గా పని చేస్తుంది. మంచి బ్యాక్టీరియా పొట్టలో పెరిగేటట్టు చేస్తుంది.

హైపర్ టెన్షన్ కంట్రోల్ లో ఉంటుంది:

ఈ పండ్ల వల్ల హైపర్ టెన్షన్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.

ఒత్తిడి ఉండదు:

రేగు పండ్లను తీసుకోవడం వలన ఒత్తిడి కూడా దూరం అవుతుంది.

క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది:

ఈ పండ్ల వలన క్యాన్సర్ ముప్పు కూడా ఉండదు. ఇలా ఈ సమస్యలని రేగు పండ్ల తో దూరం అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news