కిడ్నీల ఆరోగ్యానికి ఈ ఆహారాలు తప్పనిసరి.. CKD వ్యాధి ముదరకముందే మేల్కొండి..!!

-

కిడ్నీ సమస్యలు అనేవి ఈరోజుల్లో అందరికి చాలా కామన్‌ అయిపోయింది. కరోనా వచ్చిన మొదట్లో అందరూ భయపడ్డారు.. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. కిడ్నీ ఫెయిల్యూర్‌ అంటే కొన్ని ఏళ్ల క్రితం అందరికి భయం ఉండేది, అదేదో అరుదైన వ్యాధి అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు పదింట నాలుగు వంతుల మందికి కిడ్నీ సమస్యలు ఉంటున్నారు. సాక్షాత్తూ నేషనల్‌ కిడ్నీ ఫౌండేషనే చెప్పింది.. ప్రపంచ జనాభాలో పది శాతం మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని..

కిడ్నీలు చిన్న బీన్ ఆకారపు అవయవాలు. ఇవి అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తాయి. ఇది వ్యర్థ ఉత్పత్తులను ఫిల్టర్ చేసి, రక్తపోటును నియంత్రించే హార్మోన్లను విడుదల చేస్తాయి., శరీర ద్రవాలను సమతుల్యం చేయడం, మూత్రాన్ని ఉత్పత్తి చేయడం ఇలా ఇతర ముఖ్యమైన విధులను కలిగి ఉంటుంది. ఒక కిడ్నీలో రాయి ఉంటే మరో కిడ్నీలో కూడా స్టోన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇలాంటి అనేక రాళ్ళు కలిసి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (CKD), మూత్రపిండాల వైఫల్యం ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది ప్రాణాంతకం కూడా.

అసలు కిడ్నీ ఎలా దెబ్బతింటుంది?

మధుమేహం, అధిక రక్తపోటు మూత్రపిండాల వ్యాధికి అత్యంత సాధారణ ప్రమాద కారకాలు. ఊబకాయం, ధూమపానం, జన్యుశాస్త్రం, లింగం, వయస్సు కూడా మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతాయట. మూత్రపిండాలు సరిగ్గా పని చేయనప్పుడు, ఆహారం నుంచి వ్యర్థ పదార్థాలతో సహా రక్తంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. అందువల్ల, కిడ్నీ వ్యాధి ఉన్నవారు ప్రత్యేక ఆహారాన్ని తీసుకోవాలి.

ఆహారంలో సోడియం, ప్రొటీన్, పొటాషియం, ఫాస్పరస్ తక్కువగా ఉండే ఆహారాలు ఉంటాయి.

వెల్లుల్లి ఉప్పుకు మంచి ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. పోషక ప్రయోజనాలను అందిస్తూనే వంటల రుచిని కూడా పెంచుతుంది. కాబట్టి వంటల్లో ఉప్పు వాడకం తగ్గించి వెల్లులని వాడుకోవచ్చు.

రెడ్ క్యాప్సికమ్‌లో పొటాషియం తక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో విటమిన్లు ఎ, సి, బి6, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇందులో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌ను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. వీటిని కాల్చిన లేదా సలాడ్లుగా కట్ చేసి తినవచ్చు.ఇది కిడ్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. కాస్ట్‌ కాస్త ఎక్కువగానే ఉంటుంది.

యాపిల్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి , మలబద్ధకాన్ని నివారిస్తాయి. కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుతాయి. యాపిల్‌లను పచ్చిగా, వండిన లేదా జ్యూస్ రూపంలో ఎలా అయినా తీసుకోవచ్చు.

చేపలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని శరీరం స్వయంగా తయారు చేసుకోదు. ఈ సందర్భంలో చేపలను వారానికి మూడు సార్లు తీసుకోవడం వల్ల మీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. శరీరంలో మంటను తగ్గిస్తుంది. క్యాన్సర్‌తో పోరాడుతుంది. మాంసం కంటే చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి.

క్రాన్బెర్రీస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు సహజ ఔషధంగా పనిచేస్తాయి. ఇది మూత్రం ఆమ్ల స్థాయిని పెంచుతుంది. ఇది బ్యాక్టీరియాను తొలగించడానికి పనిచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news