ఈ మధ్య అనారోగ్య సమస్యలు ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా ఫ్లూ కేసులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌లు H3N2 మరియు H1N1 వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. 451 H3N2 వైరస్ కేసులు జనవరి 2 నుంచి మార్చి 5 మధ్యలో దేశంలో నమోదు అయ్యాయి. H3N2, H1N1 అంటే ఏమిటి..? ఈ వైరస్‌ల లక్షణాలు ఏమిటి వంటి వివరాలని చూసేద్దాం. H3N2, H1N1 ఇన్‌ఫ్లుఎంజా వైరస్‌లు.
H3N2, H1N1 ఎక్కువ వీళ్ళకి వస్తుంది..?
రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉన్నవారికి ఈ ఇబ్బంది ఎక్కువ వచ్చే అవకాశం వుంది.
ఆస్తమా పేషెంట్స్ కి డయాబెటిక్ పేషెంట్స్ కి కూడా ఇబ్బందే. అలానే న్యూరోలాజికల్ లేదా న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్స్ వున్నా గుండె సమస్యలు వున్నా కూడా ఈ సమస్య త్వరగా వస్తుంది. అలానే ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు పిల్లలలో కూడా ఈ సమస్య రావచ్చు.
H3N2, H1N1 వైరస్ లక్షణాలు:
ముక్కు కారటం, ముక్కు మూసుకపోవడం, ఒళ్ళు నొప్పులు, జర్వం, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, అలసట. ఒక్కోసారి వాంతులు, విరేచనాలు కూడా ఉంటాయి.
ఈ జాగ్రత్తలు తీసుకోండి:
ఏడాదికి ఒకసారి ఇన్ప్లుఎంజా టీకా వేయించుకుంటే ఈ ఇబ్బంది రాదు.
పరిశుభ్రతని పాటించండి. చేతులు తరచు శుభ్రం చేసుకోవాలి.
దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చెయ్యి లేదా టవల్ ని అడ్డు పెట్టుకోండి. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించండి. బయటకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులు కడగండి.