ఈ మూలికలతో.. థైరాయిడ్‌ను ఆరోగ్యంగా ఉంచవచ్చు..!

-

ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. ఆరోగ్యంగా ఉండకూడదని ఎవరనుకుంటున్నారు.. ఈ రోజుల్లో చాలామంది రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్నారు. థైరాయిడ్ సమస్యలను కూడా మనం వింటున్నాం. థైరాయిడ్ గ్రంధి పని తీరులో మార్పులు వచ్చి హైపర్ థైరాయిడిజం హైపో థైరాయిడిజం వంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి థైరాయిడ్ వలన బరువు పెరగడం, తగ్గడం, జుట్టు రాలిపోవడం, నెలసరి సరిగ్గా రాకపోవడం, గర్భం దాల్చ లేకపోవడం ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి.

అందుకే ఖచ్చితంగా థైరాయిడ్ ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ వహించాలి థైరాయిడ్ గ్రంధిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యంగా ఉంటే చాలా సమస్యలు ఉండవు. అశ్వగంధ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అశ్వగంధ తీసుకుంటే థైరాయిడ్ పనితీరు మెరుగు పడుతుంది. అశ్వగంధలో ఆల్కలాయిడ్స్ రసాయనాలు ఉంటాయి. ఇవి యాక్టివ్ హార్మోన్లకి సహాయపడతాయి. అల్లం కూడా చక్కటి ప్రయోజనాలని అందిస్తుంది. లేవగానే అల్లం వేసి నీళ్లు మరిగించి ఆ నీళ్ళని తీసుకుంటే ఈ థైరాయిడ్ సమస్య ఉండదు. ఈ రసంలో మీరు కావాలనుకుంటే తేనే పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు.

మునగాకు కూడా థైరాయిడ్ హెల్త్ కి సహాయం చేస్తుంది మునగాకుని కూడా మీరు డైట్ లో చేర్చుకోవడం మంచిది. కావాలనుకుంటే మునగాకు టీ కూడా తీసుకోవచ్చు. నల్లజీలకర్ర కూడా థైరాయిడ్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అతి మధురం కూడా థైరాయిడ్ హెల్త్ కి ఉపయోగపడుతుంది ఇలా మీరు వీటిని తీసుకుంటే థైరాయిడ్ హెల్త్ గురించి చూసుకోకర్లేదు ఆరోగ్యంగా ఉండొచ్చు. రకరకాల సమస్యలు బారిన పడకుండా ఆరోగ్యంగా జీవించొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version