బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్‌ టిఫెన్‌.. ఓట్స్‌తో ఇలా ఉప్మా చేసేయండి..

-

బరువు తగ్గాలనుకునేవారు టిఫెన్‌ మానేస్తున్నారు. కానీ టిఫన్‌ స్కిప్‌ చేయడం అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదు. మరి అలా అని.. దోశలు, ఇడ్లీలు తిందామంటే.. బరువు తగ్గాలనుకునేవారు ఇవి మానేయాలని అంటున్నారు. ఏం తినాలి. ఏవో ఫ్రూట్స్‌, నట్స్‌, స్ప్రౌట్స్‌తో పనికానిచ్చేస్తాం..! అయితే ఓట్స్‌ను డైట్‌ ఫాలో అయ్యేవాళ్లు కచ్చితంగా వాళ్ల మెనూలో చేర్చుకుంటారు. ఓట్స్‌తో ఉప్మా చేస్తే అటు రుచి, ఇటు ఆరోగ్యం కూడా..!

ఓట్స్‌ ఉప్మా తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు…

ఓట్స్‌ ఒక కప్పు
టమోటా జ్యూస్ రెండు కప్పులు
క్యారెట్‌ తురుము అరకప్పు
జీడిపప్పు ముక్కలు అరకప్పు
క్యాప్సికమ్‌ ముక్కలు అరకప్పు
పచ్చిబఠానీ చెక్కాముక్క అరకప్పు
కొబ్బరి తురుము అరకప్పు
ఉల్లిపాయ ముక్కలు అరకప్పు
పచ్చిమిర్చి ముక్కలు అరకప్పు
అల్లం తురుము ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర ఒక టీ స్పూన్
ఆవాలు ఒక టీ స్పూన్
మినపప్పు ఒక టీ స్పూన్
పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్
లెమన్‌ జ్యూస్‌ ఒక టేబుల్‌ స్పూన్
మీగడ ఒక టేబుల్‌ స్పూన్
పసుపు కొద్దిగా
కరివేపాకు కొద్దిగా
కొత్తిమీర కొద్దిగా

తయారు చేసే విధానం..

పొయ్యిమీద పాత్ర పెట్టి ఓట్స్‌ వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. అదే పాత్రలో ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, మీగడ వేసి వేడెక్కనివ్వండి. అల్లం తురుము, కరివేపాకు వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేగిన తర్వాత క్యారెట్‌ ముక్కలు,పచ్చిబఠానీలు లైట్‌గా గ్రైండ్ చేసుకున్నవి కూడా వేయండి. పసుపు వేసి క్యాప్సికమ్‌ ముక్కలు కూడా వేయండి. మూతపెట్టి మగ్గనివ్వండి. అలా మగ్గిన తర్వాత రెండు కప్పుల టమోటా జ్యూస్‌ వేయండి. వాటర్‌ పోస్తే ఉప్మా చప్పగా అయిపోతుంది. కొద్దిగా నిమ్మరసం వేయండి. ఓట్స్‌ వేసి బాగా కలిపి మూతపెట్టండి. ఐదు నిమిషాలు సిమ్‌లోఉంచితే చాలు..పొడిపొడిగా ఉప్మా రెడీ అవుతుంది. దించే ముందు పచ్చికొబ్బరి , కొత్తిమీర వేసి కలిపేసుకుని దింపేయండి. ఓట్స్‌తో కూడా ఉప్మా ఇలా రుచిగా చేసేకోవచ్చు. ఓసారి ఇలా కూడా ట్రే చేయండి.!

Read more RELATED
Recommended to you

Latest news