శృంగార జీవితాన్ని మరింత ఆనందంగా మార్చడానికి పాటించాల్సిన కొన్ని టిప్స్..

శృంగారమనేది జీవితంలో ఒక భాగం. శృంగార జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే అది సాధారణ జీవితంపై చాలా ప్రభావం చూపుతుంది. అందుకే అలా కాకుండా ఉండడానికి శృంగార జీవితాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.

భాగస్వామితో మాట్లాడండి

భాగస్వామితో మాటలు కలపడం మీలో భయాన్ని తగ్గిస్తుంది. మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారనే విషయాలు మీ భాగస్వామితో చర్చిస్తే అవతలి వారికి ఎక్కడ సమస్య ఉందో సులభంగా అర్థం అవుతుంది. అప్పుడు సమస్య దూరమయ్యే అవకాశం ఎక్కువ. అందుకే మాట్లాడడం నేర్చుకోండి. ఇలా మాట్లాడేటపుడు మీ భాగస్వామిని విమర్శించవద్దు.

మీతో మీరు మాట్లాడండి.

శృంగార జీవితంపట్ల మీకంటూ సరైన అభిప్రాయాన్ని తెచ్చుకోండి. మీ వైపు నుండి ఏం మార్చుకోవాలో ఆలోచించండి. మీ భాగస్వామి పట్ల మీరెలా ఉంటున్నారనేది గుర్తు తెచ్చుకోండి. శృంగారానికి మూలం స్పర్శ అని గుర్తుంచుకోండి. శృంగారం మీద మీకున్న ఫాంటసీలని ఒక పేపర్ మీద రాయండి. ఆల్కహాల్ సేవించడం, పొగ త్రాగడం మొదలగు వాటి జోలికి పోవద్దు.

సృజనాత్మకత పెంచుకోండి

శృంగారంలో కొంచెం సృజనాత్మకత జోడిస్తే మీ భాగస్వామికి మరింత ఆసక్తికరంగా ఉంటుంది. అలా చేయడానికి మీరేమి చేయగలరో ఆలోచించండి. అదేదో సీరియస్ విషయం అని కాకుండా చాలా సాధారణమైనదిగా మీ భాగస్వామికి తెలియచెప్పితే బాగుంటుంది.

ఇలాంటి విషయాల్లో మరీ అతిగా ప్రవర్తించవద్దు. ఒక్కోసారి అది బెడిసి కొట్టే ప్రమాదం ఉంది. మీ చేష్టలకి భాగస్వామి ఎలా స్పందిస్తున్నారనే దానిమీద మీ చర్యలు ఆధారపడి ఉండాలి. అవతలి వారి ఆసక్తులను జాగ్రత్తగా గమనించండి. మీలో భయం ఎలా పోగొట్టుకున్నారో భాగస్వామిలోనూ భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేయండి.