ఆరోగ్యం: 15నిమిషాలు నడిస్తే ఇన్ని లాభాలుంటాయా?

-

వ్యాయామం మొదలు పెట్టాలనుకునే వారు నడకతోనే ప్రారంభిస్తారు. ఆ తర్వాత పరుగులోకి దిగి శరీర అవయవాల కడరాల కదలికల దాకా, ఇంకా బరువులు ఎత్తడం వరకు కొనసాగిస్తూ ఉంటారు. ఇప్పటి దాకా వ్యాయామం చేయాలని అనుకుని ఏం చేస్తాంలే అని మానేసినట్టయితే ఈరోజే నడక ప్రారంభించండి. 15నిమిషాల నడకతో మీ ఆరోగ్యమే మారిపోతుంది. అసలు నడక వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసుకోండి. ఆరోగ్యం: 15నిమిషాలు నడిస్తే ఇన్ని లాభాలుంటాయా?

అధిక శక్తి నుండి బరువు తగ్గడం వరకు 15నిమిషాల నడకతో చాలా లాభాలున్నాయి. వాటిల్లో కొన్ని మీకోసం.

ఆనందం

అమెరికన్ జర్నల్ ప్రచురించిన దాని ప్రకారం 15నిమిషాల నడక మీలో కొత్త శక్తిని రగిలింపజేసి ఆనందాన్ని అందిస్తుంది. ఈ నడక బయట అయితే బాగుంటుంది.

జీవక్రియ మెరుగుపడుతుంది

నైజీరియా మెడికల్ జర్నలో వచ్చిన దాని ప్రకారం కేవలం 15నిమిషాల నడక వల్ల జీవక్రియ సంబంధ ఇబ్బందులు 29శాతం తగ్గుతున్నాయి.

జీవితకాలాన్ని పెంచుతుంది

ప్రతీరోజూ పదిహేను నిమిషాల నడక మీ జీవితకాలాన్ని పెంచుతుంది. పరుగులాంటి నడక మీ జీవిత పరుగును మరింత పెంచుతుంది.

మంచి నిద్ర

మంచి నిద్ర మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. 15నిమిషాల నడక మంచి నిద్రకి కారణం అవుతుంది. ఉదయం అరగంట ఎక్కువ నిద్రపోయి వాకింగ్ కి వెళ్ళకుండా మరుసటిరోజు నిద్రను దూరం చేసుకుంటారా అన్నది మీరే నిర్ణయం తీసుకోవాలి.

మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది

మంచి నడక వల్ల రక్తప్రసరణ పనితీరు బాగుంటుంది. దానివల్ల మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది. ఇది ఇతర ఇబ్బందులను రానివ్వకుండా కాపాడుతుంది.

నొప్పిని దూరం చేస్తుంది

నడుము నొప్పి నుండి మొదలుకుని చిన్న చిన్న శరీర నొప్పులను దూరం చేసుకోవాలంటే పొద్దున్న లేవగానే 15నిమిషాల పాటు నడవండి. కొద్దిరోజుల్లో తేడా మీకే తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news