రెగ్యులర్‌గా ప్లాంక్ వ్యాయామం చేయడం వల్ల ఎన్ని లాభాలో..

-

మన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి రోజూ వ్యాయామం చేయడం అనేది మంచి అలవాటు.. ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి, అందానికి సహాయపడే అనేక వ్యాయామాలు ఉన్నాయి. వాటిలో ప్లాంక్ ఒకటి. ప్లాంక్ చేయి కండరాలు, కాలు కండరాలు, వెన్నెముక, ఉదర కండరాలకు చాలా ప్రయోజనకరమైన వ్యాయామం. రోజూ ప్లాంక్ వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం..!

ప్లాంక్‌లు వేస్తే బెల్లీ ఫ్యాట్‌ త్వరగా తగ్గిపోతుంది. ఎంత త్వరగా అంటే.. కేవలం మూడు, నాలుగు రోజుల్లోనే తేడా వస్తుంది. ఇది కాళ్లు, చేతుల కండరాలను కూడా బలోపేతం చేస్తుంది. మనం ప్లాంక్ పొజిషన్‌ను ఎంత ఎక్కువసేపు పట్టుకోగలిగితే, మన శరీరం అంత బలంగా మారుతుంది. జర్నల్ ఆఫ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ రీసెర్చ్‌లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. క్రంచెస్, సిట్-అప్స్ వంటి వ్యాయామ పద్ధతుల కంటే ప్లాంక్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎక్కువ సమయం పాటు ఆ స్థానాన్ని పట్టుకోవడం వల్ల కండరాలు, నాడీ వ్యవస్థ బలంగా తయారవుతాయి. ప్లాంక్‌ను తప్పుగా చేయడం వల్ల చాలా మందిపై వ్యతిరేక ప్రభావం ఉంటుంది.

వెన్నునొప్పి ఉన్నవారు ప్రతిరోజూ కొద్దిసేపు ప్లాంక్‌లు వేయడం అలవాటు చేసుకోవాలి. ప్లాంక్ ద్వారా శరీరాన్ని సరైన స్థితిలో ఉంచడం వల్ల ఇది వెన్నెముకను సరిదిద్దడంలో కూడా సహాయపడుతుంది. ఈ వ్యాయామం పురుషులు, మహిళలు ఇద్దరూ చేయవచ్చు. క్రమం తప్పకుండా ప్లాంక్ చేయడం వల్ల కండరాలు పెరుగుతాయి మరియు దృఢంగా మారతాయి. మరొకటి ఏమిటంటే, సరైన శరీర కూర్పును సాధించడంలో ప్లాంక్ చాలా సహాయపడుతుంది.

ప్లాంక్‌ వేయడం ఎలా..?

ప్లాంక్‌ వేయాలంటే..ముందుగా నేలకు బోర్లా పడుకోని నిటారుగా లేవాలి.. కాళ్ల దగ్గర నుంచి తల వరకూ అంతా.. సమానంగా పైకి లేపాలి. కొంతమంది నడుము మాత్రమే లేపుతారు.. దీని వల్ల నడుము నొప్పి వస్తుంది. ప్లాంక్‌ సరిగ్గా ఎలా వేయాలో మీరు సోషల్‌ మీడియాలో వీడియో ద్వారా చూసి కూడా నేర్చుకోవచ్చు. అలాగే మొదటి రోజు..10-30 సెకన్ల పాటు ఉండండి. అలా నెమ్మదిగా సెకన్లు పెంచుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version