మీరు కాలుస్తున్నది సిగిరెట్ ని కాదు మీ జీవితాన్ని కూడా…. పొగాకు వలన కలిగే సమస్యలు, నష్టాలు ఇవే..!

-

పొగాకు వల్ల ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. పొగాకుని తీసుకోవడం వల్ల గుండె సమస్యలు కూడా వస్తాయి. అయితే పొగాకు లో ప్రమాదకరమైన క్యాన్సర్ కారకాల ఉంటాయి. అయితే సిగరెట్లు కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ పొగాకు లో వుంటాయి.

దీనిని తీసుకోవడం వల్ల ఇది మన శరీరం లోకి వెళుతుంది. దానితో ఆరోగ్యం బాగా దెబ్బ తింటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే పొగాకును తీసుకోవడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఈసోఫేగస్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది.

”మీరు కాలుస్తున్నది
సిగిరెట్ ని కాదు
మీ జీవితాన్ని”…….

నోటికి సంబంధించి అన్ని క్యాన్సర్లు కూడా పొగాకు వలన వచ్చే అవకాశం ఉంటుంది. ఇంత హానికరమైన పదార్థానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పొగాకు వల్ల చిగుళ్ల వ్యాధులు, దంతక్షయం, పళ్ళు రంగు మారిపోవడం, పళ్ళు ఊడిపోవడం, ల్యుకోప్లేకియా వంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. నిజానికి వీలయినంత వరకు దీనికి దూరంగా ఉండటం మంచిది. అయితే పొగాకుని తీసుకున్న వారితో పాటు మీ పక్కనున్న వాళ్ళు కూడా దీని వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు.

”మీరు పంచుకుంటున్నది
సిగిరెట్ ఒక్కటే కాదు
అనారోగ్యాన్ని కూడా”…

పొగాకు వలన కలిగే సమస్యలు:

పొగాకు వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. పొగాకులోని నికోటిన్ ఇంక అనేక క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. కనుక హృదయ సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే దీనికి దూరంగా ఉండాలి.

పొగాకు వాడకం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది ప్రాణాలను కోల్పోతున్నారు. కేవలం మన భారత దేశం లో సంవత్సరానికి పది లక్షల మంది సిగరెట్ తాగడం వల్ల చనిపోతున్నారని గవర్నమెంట్ చెబుతోంది. అలానే వదిలే పొగ పీల్చడం వల్ల 9 లక్షల మంది మరణిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news