HDL కొలెస్ట్రాల్‌ ఎందుకు మంచిది..? ఈ ఆహారాలు తింటే నిజంగానే గుడ్‌ కొలెస్ట్రాల్‌ పెరుగుతుందా..?

-

కొలెస్ట్రాల్‌ అంటే ఇందులో రెండు రకాలు ఉంటాయి. గుడ్‌, బ్యాడ్‌ అని మనకు తెలుసు. మనకు మంచి చేస్తుంది కాబట్టి గుడ్‌ కొలెస్ట్రాల్‌ అంటారు. చెడు చేస్తుంది కాబట్టి బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ అని పిలుచుకుంటాం. అసలు కొలెస్ట్రాల్‌లో ఇన్ని రకాలు ఉండవు. అంతా ఒకటే ఉంటుంది. అందులో డెన్సిటీని బట్టి ఇది ఇలా విభజించబడుుతంది. ఆరోగ్యానికి మేలు జరగాలంటే.. గుడ్‌ కొలెస్ట్రాల్‌ ఉన్నవి తినాలనుకుంటారు.. ఏ ఆహారంలో కొలెస్ట్రాల్‌ ఉండదు. మన లివరే ఇది తయారు చేస్తుంది. కొలెస్ట్రాల్‌ ఎలా తయారవుతుంది, గుడ్‌ కొలెస్ట్రాల్‌ బాడీలో ఎంత ఉండాలి, ఏం తింటే మనకు గుడ్‌ కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది ఇవన్నీ పూర్తిగా మీకోసం..!

గుడ్‌ కొలెస్ట్రాల్‌ (High Density Lipoprotein) HDl. దీన్ని మంచిది అంటారు.. మన బాడీలో ఈ కొలెస్ట్రాల్‌ 40-50 మిల్లీ గ్రాములకంటే ఎక్కువ ఉండాలి. అసలు దీన్నే ఎందుకు గుడ్‌ కొలెస్ట్రాల్‌ అంటారంటే.. ఈ కొలెస్ట్రాల్‌ చేసే పనులు మనకు మంచివి కాబట్టి.. ఏం పనిచేస్తుందనే డౌట్‌ మీకు ఈపాటికే వచ్చి ఉండాలే..

HDl కొలెస్ట్రాల్‌ ప్రధానంగా చేసే పనులు

రక్తనాళాల్లో పూడికలు, పేరుకుపోయిన బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ను కరిగించడం
రక్తనాళాలను క్లీన్‌ చేసి, రక్తసరఫరా ఆటంకం లేకుండా చేయడం
హెచ్‌డిఎల్ స్థాయిలను పెంచడం వల్ల గుండెపోటు మరియు స్ట్రోక్‌ల నుండి రక్షణ లభిస్తుంది. దీనికి విరుద్ధం.

HDl కొలెస్ట్రాల్‌ పెరగాలంటే ఏం తినాలి..

కొలెస్ట్రాల్‌ అల్టిమేట్‌ రోల్‌ ఏంట్రా అంటే..మంచి కొలెస్ట్రాల్‌ గుండెను కాపాడుతుంది.. బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ గుండె పోటుకు దారితీస్తుంది. మీరు ఒక విషయం తెలుసుకోవాలి.. ఏ ఆహారాల్లోనూ డైరెక్టుగా గుడ్‌, బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ ఉండదు. చాలామంది బాదంపప్పు, వాల్‌నట్స్‌ గుండెకు మంచివి అని తింటుంటారు. గుడ్‌ను బ్యాడ్‌ను తయారు చేసేది మన లివర్‌.. అంటే లివర్‌ను ప్రొడెక్షన్‌ యూనిట్‌గా తీసుకుందాం.. మనం తినే ఆహారంను బట్టి ఇవి తయారవుతాయనమాట. అంటే మనం లివర్‌కు అందించే ఆహారాలు గుడ్‌ కొలెస్ట్రాల్‌ను పెంచేవిగా ఉండాలి. ఇన్‌డైరెక్ట్‌ కొవ్వులను లివర్‌కు అందిస్తే..గుడ్‌ కొలెస్ట్రాల్‌ను లివర్‌ తయారుచేసుకుంటుంది.

ఇన్‌డైరెక్ట్‌ కొవ్వులు అంటే ఏంటి..?

ఆల్ఫాలెనోలిక్‌ యాసిడ్‌ కొవ్వులు ఎక్కువ ఉన్నవి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువ ఉన్నవి, ఒమేగా 6 ఉన్నవి ఇన్‌డైరెక్టు కొవ్వుల కిందకు వస్తాయి. ఇలాంటి ఆహారాలు మనం లివర్‌కు అందిస్తే.. అది గుడ్‌ కొలెస్ట్రాల్‌ను తయారు చేస్తది. మరి ఇవి ఎక్కువగా ఉండే ఆహారాలు ఏంట్రా అంటే.. బాదంపప్పు, వాల్‌నట్స్‌, అవిసె గింజలు, రాజ్మా గింజలు, జనపనార విత్తనాలు వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. జీడిప‌ప్పులో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. అలాగే మెగ్నిషియం, ఐర‌న్‌, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిని నానపెట్టుకుని తింటే మరీ మంచిది. ఇవి శ‌క్తి స్థాయిల‌ను పెంచుతాయి. బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి. గుమ్మ‌డికాయ విత్త‌నాలు, చియా సీడ్స్‌లోనూ త‌గిన మోతాదులో మెగ్నీషియం ఉంటుంది. ఇవి గుండెను సంర‌క్షిస్తాయి. హెచ్‌డీఎల్ లెవ‌ల్స్ ను పెంచుతాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి.

వీటితో పాటు కొబ్బరి, పిస్తాపప్పు, బీన్స్‌, ప‌ప్పు దినుసులు, శ‌న‌గ‌లు, పెస‌లు, సోయాబీన్స్‌ల‌లో ఐర‌న్ అధికంగా ఉంటుంది. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి హెచ్‌డీఎల్‌ను పెంచుతాయి. అందువ‌ల్ల ఈ ఆహారాల‌ను రోజూ తీసుకుంటే మంచిది. వీటిల్లో ఉండే ఫోలేట్, మెగ్నిషియం, పొటాషియం గుండె జ‌బ్బులు రాకుండా ర‌క్షిస్తాయి. ఎల్‌డీఎల్‌ను త‌గ్గిస్తాయి. హెచ్‌డీఎల్‌ను పెంచుతాయి.

అవ‌కాడోల‌ను తిన‌డం వ‌ల్ల వాపుల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతాయి. హెచ్‌డీఎల్ లెవ‌ల్స్ పెరుగుతాయి. వీటిల్లో మెగ్నిషియం, పొటాషియం, విట‌మిన్ బి, కె, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. ఇవి ఎల్‌డీఎల్‌ను త‌గ్గిస్తాయి. హెచ్‌డీఎల్ లెవ‌ల్స్‌ను పెంచుతాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే పప్పు తియ్యని ధాన్యాలు, ఆకుకూరలు తినడం వల్ల గుడ్‌ కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది.

ఎవరి బాడీలో అయితే హెడీఎల్‌ స్థాయి తక్కువగా ఉంటుందే.. వారికి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం. ఇలాంటివి మీ డైలీ డైట్‌లో భాగం చేసుకుంటే..గుడ్‌ కొలెస్ట్రాల్‌ను పెంచుకోవడమే కాదు.. బరువు కూడా తగ్గొచ్చు.!

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version