మీ రాశి ప్రకారం జన్మాష్టమి రోజున కృష్ణుడికి ఏ నైవేద్యం సమర్పించాలో తెలుసా..?

-

సుందరం.. సుమధురం.. శ్రీకృష్ణుడి రూపం. ఆ మనోహర రూపాన్ని దర్శించడం కళ్లు చేసుకున్న అదృష్టం. ఆ మురళీధరుడి అనుగ్రహం పొందడానికి మనసారా ఆయణ్ని కొలిస్తే చాలు. ఎలాంటి హంగూఆర్భాటాలు లేకుండా నిర్మలమైన మనస్సుతో.. నిశ్చలమైన భక్తితో ఆయన నామాన్ని స్మరిస్తే చాలు.. కోరుకుంది తీర్చే కొంగుబంగారంగా నిలుస్తాడు. మరి ఆ జగన్నాటక సూత్రధారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన జన్మదినం అయిన శ్రీకృష్ణ జన్మాష్టమి కంటే మంచి రోజు ఏం ఉంటుంది. సాధారణంగా చేసే పూజలు, నైవేద్యాలు కాకుండా.. జన్మాష్టమి రోజున మీ రాశికి తగ్గట్లుగా ఆ కృష్ణుడికి నైవేద్యం సమర్పించండి. జగన్నాధుడి అనుగ్రహం పొందండి..

శ్రీకృష్ణ జన్మాష్టమి. కృష్ణుడు పుట్టిన రోజును అత్యంత వైభవంగా.. కన్నులపండువగా జరుపుకునే వేడుక. మన ఇంట్లో చిన్నపిల్లలను కృష్టుడిలా అలంకరించి వారు బుడిబుడి అడుగులతో తిరుగుతుంటే ఇంట్లో సాక్షాత్తూ ఆ జగన్నాధుడే నడయాడినట్లుగా ఉంటుంది. కొంతమంది జన్మాష్టమి రోజున ఉపవాసం ఉంటారు. కన్నయ్యకి ఇష్టమైంది వెన్న అయినా.. ఇంకా చాలా రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ముఖ్యంగా పిల్లలు పుట్టాలని చాలా మంది ఇవాళ ప్రత్యేక వ్రతాలు చేస్తారు.

ఇలాంటి శుభదినాన కేవలం సాధారణ నైవేద్యాలతో శ్రీకృష్ణుడికి సరిపెట్టలేం. అందుకే మీ రాశికి అనుగుణంగా కన్నయ్యకు నైవేద్యం సమర్పించండి. రాశులకు అనుగుణంగా నైవేద్యం, పలు వస్తువులను కిట్టయ్యకు సమర్పించి అనుగ్రహం పొందండి. మరి ఏ రాశి వారు ఏం సమర్పించాలంటే..

మేషం – ఈ రాశి వారు శ్రీకృష్ణునికి వెన్న, పంచదార, వస్త్రాలు సమర్పించాలి.

వృషభం – ఈ రాశికి చెందిన భక్తులు లడ్డూ గోపాలాన్ని వెండి ఆభరణాలతో అలంకరించి వెన్న నైవేద్యంగా సమర్పించాలి.

మిథునం – కిట్టయ్యకు పెరుగును సమర్పించండి.

కర్కాటకం – కృష్ణభగవానుడిని తెలుపు రంగు వస్త్రాల్లో అలంకరించి జన్మాష్టమి రోజున పాలు, కుంకుమ సమర్పించండి.

సింహం – కన్నయ్యను గులాబీ రంగు వస్త్రాల్లో అలంకరించి అత్యంత ప్రీతిపాత్రమైన వెన్న, పంచదార సమర్పించండి.

కన్య – ఆకుపచ్చని వస్త్రాలను కిట్టయ్యకు అలంకరించి, కోవా బర్ఫీని సమర్పించండి.

తుల – గులాబీ లేదా కుంకుమ రంగు దుస్తులతో కృష్ణుడిని అలంకరించి వెన్న ,పంచదార సమర్పించండి.

వృశ్చికం – శ్రీకృష్ణుడిని ఎర్రటి వస్త్రంతో అలంకరించండి. లడ్డూ గోపాల్‌కి వెన్న లేదా నెయ్యి నైవేద్యంగా పెట్టడం వల్ల శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుంది.

ధనస్సు – పసుపు వస్త్రాలతో జగన్నాధుడిని అలంకరించి పసుపు మిఠాయిలు సమర్పించి కిట్టయ్యను ఖుష్ చేయండి.

మకరం – ఈ రాశి వారు శ్రీకృష్ణునికి నారింజ రంగులో అలంకరించి పంచదార నైవేద్యాలు సమర్పించి శుభ ఫలితాలు పొందుతారు.

కుంభం – కన్యయ్యను నీలిరంగు వస్త్రాలతో అలంకరించి భగవంతుడికి బాదూషాని సమర్పించండి.

మీనం – ప్రకారం – కృష్ణుడిని పీతాంబరి రంగు దుస్తుల్లో అలంకరించి కుంకుమ, కోవా స్వీట్లను అందజేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news