స్ఫూర్తి: ఉద్యోగం మానేసి మరీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఏడాదికి 12 లక్షలు… ఈ NRI స్టోరీని చూస్తే మెచ్చుకుంటారు..!

-

నిజానికి మనం చేసే పని మీద మనం నమ్మకం పెట్టుకుని కష్టపడితే అనుకున్నది ఎంత కష్టమైనా పూర్తి చేయొచ్చు. ఎప్పుడు కూడా ఫలితం వస్తుందా రాదా అని టెన్షన్ పడుతూ ఏ పనిని కూడా మొదలు పెట్టకూడదు. ఎప్పుడూ కూడా కాన్ఫిడెన్స్ తో మనం చేసే పని చేసుకుంటూ పోతే తప్పక మంచి ఫలితం వస్తుంది. కాబట్టి ఎప్పుడూ అనుమాన పడకుండా ముందుకు వెళ్ళి పోతూ ఉండాలి.

 

అంతే కాని ఒకటికి పది సార్లు ఏమౌతుంది అని భయపడుతూ ఉంటే ఇక ఆ పని పూర్తవదు. భయపడుతూనే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతూ నమ్మకంతో ముందుకు వెళ్లిపోవాలి. అప్పుడు తప్పకుండా ఎంతటి కష్టాన్ని అయినా ఎదుర్కోవచ్చు. అలానే పంజాబ్‌కు చెందిన రాజ్‌విందర్ సింగ్ ధలీవాల్ నడుచుకున్నారు. అందుకే సక్సెస్ అవ్వగలిగారు.

33 ఏళ్ల వయస్సులో అతని కుటుంబం యుఎస్ వెళ్లిపోయారు. అక్కడ ఆయన హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీని అభ్యసించాడు. మంచి చెఫ్ కూడా అయ్యారు. కానీ ఇండియా వచ్చేయాలనుకున్నారు. తిరిగి వచ్చిన తర్వాత రాజ్‌విందర్ పంజాబ్‌లో పిజ్జా రెస్టారెంట్‌ను స్టార్ట్ చేసారు. కానీ అది సెట్ కాలేదు అని భావించి.. వ్యవసాయం మొదలు పెట్టారు. సేంద్రీయపద్ధతుల్లో సాగు చేయాలని అనుకున్నారు. ప్రస్తుతం రాజ్‌విందర్ ఏకీకృత వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి ఆరు ఎకరాల భూమిలో పంటలు పండిస్తున్నారు మంచిగా లాభాలను కూడా పొందుతున్నారు.

మొదట వ్యవసాయం గురించి తెలీదు. కానీ నెమ్మదిగా సాగు గురించి, సాగు పద్ధతులు తెలుసుకున్నారు. ఆవు పేడ, కంపోస్ట్ మరియు ఇతర సేంద్రియ పదార్థాలను కోసం తెలుసుకున్నారు. మొదట్లో, రాజ్‌విందర్ 5 ఎకరాల భూమిలో చెరకు సాగు చేయడం ప్రారంభించాడు. పసుపు, జామ, చీకూ, రేగు, పియర్, కిన్నో, దానిమ్మ వంటివి కూడా సాగు చేసారు. అలానే బంగాళదుంపలు, వెల్లుల్లి, ఆవాలు, ఉల్లిపాయలు, గులాబీ మరియు ఇతర సీజనల్ మొక్కలను కూడా మొదలు పెట్టారు. బెల్లం ఉత్పత్తి చేయడానికి అనువైన చెరకు రకాలను స్టార్ట్ చేసారు. అలానే చెరుకు ద్వారా బెల్లం, బ్రౌన్ ఆర్గానిక్ షుగర్ ని అమ్మడం మొదలు పెట్టారు. ఇలా అమ్మకాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం సంవత్సరానికి రూ. 12 లక్షలు సంపాదిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news