చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరాయి.. ప్లీనరీపై రేవంత్ సంచలన ట్వీట్

-

టీఆర్ఎస్ పార్టీ 21వ ప్లీనరీకి గులాబీ శ్రేణులు సిద్ధం అయ్యాయి. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ హెచ్ఐసీసీ వేదిక గులాబీ మయంగా మారింది. నగరంలో ఎక్కడ చూసిన కేసీఆర్, కేటీఆర్ కటౌట్లను ఏర్పాటు చేశారు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు. అయితే టిఆర్ఎస్ ప్లీనరీ పై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరాయని హరీష్ రావు, కేటీఆర్ లపై సెటైర్ వేశారు రేవంత్. అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలతో ఆవిర్భవించిన తెలంగాణ కు గులాబీ చీడ పట్టిందని మండిపడ్డారు. నాడు డొక్కు సైకిళ్లు, విరిగిన కుర్చీల నుండి నేడు నిజాంను మించిన ధనవంతులుగా కల్వకుంట్ల కుటుంబం అవతరించిందని వెల్లడించారు. కేసీఆర్ కుటుంబ వైభోగం వెనుక ఒకతరం తెలంగాణ విషాదం ఉందని నిప్పులు చెరిగారు. టిఆర్ఎస్ సర్కార్ అన్యాయాలకు పాల్పడుతుందని.. దీనిపై కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని చెప్పారు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. 

 

Read more RELATED
Recommended to you

Latest news