ఆకుకూరలను పండిస్తూ ఆదర్శంగా నిలిచిన అమృతవ్వ..సక్సెస్ స్టోరీ..

-

కష్టాలు జీవితాన్ని ఎలా సాగించాలో నేర్పిస్తాయి..కన్నీళ్ళు ఒక మార్గాన్ని చూపిస్తాయని చాలా మంది అంటున్నారు. కష్ఠాలను ఎదుర్కొని ఇప్పుడు జీవితంలో సక్సెస్ ను అందుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు.. ఆ జాబితాలోకి ఇప్పుడు ఓ మహిళా చేరింది.ఆమె గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఆమె పేరు అమృతవ్వ..జగిత్యాల జిల్లా స్వగ్రామం. భర్త చిన్న వయసులోనే చనిపోవడంతో ఇద్దరు పిల్లల బాధ్యత ఈమెపై పడింది. తనకు తెలిసిన సేద్యాన్నే ఉపాధిగా మార్చుకుంది. అయితే వ్యవసాయంలో తలలు పండిన రైతులే నష్టాల బారిన పడటం సాగు గిట్టుబాటు కాదని గుర్తించిన అమృతవ్వ ప్రతి రోజు ఆదాయం ఇచ్చే, మార్కెట్‌లో డిమాండ్ ఉండే పంటలను పండించాలని నిర్ణయించుకుంది. తనకున్న ఎకరం భూమిలో తీరొక్క ఆకుకూరలను పండిస్తూ ఆదాయం పొందుతోంది. గత 30 ఏళ్లుగా ఆకుకూరలే ఏడాది పొడవునా పండిస్తోంది. అందుకే ఆమెను అందరూ ఆకూకూరల అమృతవ్వ అని పిలుస్తారు..

పాలకూర, కొత్తిమీర,తోటకూర, గోంగూర, మెంతికూర వంటి ఆకుకూరలను ఏడాదంతా సాగు చేస్తోంది అమృతవ్వ. ఏ ఆకుకూరకు ఏ సమయంలో మార్కెట్లో ఎక్కువ రేటు ఉంటుందో అమృతవ్వకు బాగా తెలుసు అందుకు తగ్గట్లుగానే ఆకుకూరలు పండిస్తుంటుంది. వివిధ కంపెనీల నుంచి నాణ్యమైన విత్తనాలు సేకరించడంతో పాటు తన తోటలో పండిన పంట నుంచి విత్తనాలకు సేకరించి వాటినే తిరిగి పంట సాగుకు ఉపయోగిస్తుంటుంది. ఇక పంట అయిపోగానే మరో పంట వేస్తూ భూమిని ఎప్పుడూ ఖాళీ ఉంచకుండా నిత్యం ఏదో ఒక ఆకుకూరను పండిస్తూ ఆదాయం పొందుతుంటుంది. సేంద్రియ ఎరువులను వినియోగించడంతో పాటు సమృద్ధిగా నీరు అందిస్తూ ఆకుకూరలు సాగుతో ఆదాయాన్ని పొందుతూ అందరికి ఆదర్శంగా నిలిచింది అమృతవ్వ..
ఉదయం లేవడం ఆకూకూరలను తీసుకోవడం మార్కెట్ లో అమ్మడం, మళ్ళీ వచ్చి తినడం మళ్ళీ పొలం పోవడం..పంట పనులను స్వయంగా తానే చూసుకోవడం..గత 30 సంవత్సరాలుగా ఆకుకూరల సాగే తన దినచర్యగా మార్చుకుని మలివయసులోనూ ఎంతో ఓపికతో సాగు పనులు చేసుకుంటూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది..బాధలకు క్రుంగిపోకుండా అమృతవ్వ కష్టాన్ని నమ్ముకుంది..నిజంగా నీ ఓపికకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

Read more RELATED
Recommended to you

Latest news