ఇక‌పై విస్తారా విమానాల్లో మ‌హిళా ప్ర‌యాణికుల‌కు ఉచితంగా శానిట‌రీ నాప్‌కిన్ల పంపిణీ..!

-

విస్తారా విమానాల్లో ఐఎస్ఓ 9001:2015 గుర్తింపు సాధించిన అత్యంత నాణ్య‌మైన శానిట‌రీ నాప్‌కిన్ల‌ను అందజేయనున్నారు. దీనిపై మ‌హిళా ప్ర‌యాణికుల‌కు అవగాహ‌న కూడా కల్పిస్తామ‌ని విస్తారా చెబుతోంది.

విమాన‌యానం చేసే మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త. ఇక‌పై విస్తారా అనే విమాన‌యాన కంపెనీకి చెందిన అన్ని విమానాల్లో మ‌హిళ‌ల‌కు శానిట‌రీ నాప్‌కిన్ల‌ను ఉచితంగా అంద‌జేయ‌నున్నారు. ఈ మేర‌కు విస్తారా సంస్థ తాజాగా ఈ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ఇకపై ఈ కంపెనీకి చెందిన ఏ విమానంలో అయినా స‌రే.. ప్ర‌యాణించే మ‌హిళ‌ల‌కు ఉచితంగా శానిట‌రీ నాప్‌కిన్ల‌ను అంద‌జేస్తారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా విస్తారా ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం విశేషం.

కాగా విస్తారా తీసుకున్న ఈ నిర్ణయ రేప‌టి నుంచి అమ‌లు కానుంది. త‌మ దేశీయ విమానాల్లో ప్ర‌యాణించే మ‌హిళ‌లు అభ్య‌ర్థించిన మేర‌కు తాము ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని విస్తారా తెలిపింది. కాగా ఈ నిర్ణ‌యంతో విస్తారా.. దేశంలోని మ‌హిళా విమాన ప్ర‌యాణికుల‌కు ఉచితంగా శానిట‌రీ నాప్‌కిన్లు అందిస్తున్న తొలి విమాన‌యాన సంస్థ‌గా గుర్తింపు పొందింది.

విస్తారా విమానాల్లో ఐఎస్ఓ 9001:2015 గుర్తింపు సాధించిన అత్యంత నాణ్య‌మైన శానిట‌రీ నాప్‌కిన్ల‌ను అందజేయనున్నారు. దీనిపై మ‌హిళా ప్ర‌యాణికుల‌కు అవగాహ‌న కూడా కల్పిస్తామ‌ని విస్తారా చెబుతోంది. విమానం క్యాబిన్‌లో శానిట‌రీ నాప్‌కిన్ల‌ను ఉంచుతామ‌ని, అవ‌స‌రం ఉన్న వారు విమానంలో ఉండే సిబ్బందిని అడిగితే శానిట‌రీ నాప్‌కిన్ల‌ను ఉచితంగా అందిస్తార‌ని కూడా విస్తారా ఇప్పటికే త‌మ విమానాల్లో ప్ర‌క‌ట‌న‌లు ఇస్తోంది. కాగా విస్తారా తీసుకున్న ఈ నిర్ణయంపై మ‌హిళా ప్ర‌యాణికులు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు..!

Read more RELATED
Recommended to you

Latest news