భూమికి 165 అడుగుల ఎత్తులో రెస్టారెంట్.. తింటుంటే ఉంటది మజా..!

-

ఒకప్పుడు రుచికరమైన ఆహారం పెడితే కస్టమర్స్‌ వచ్చేవాళ్లు.. ఇప్పుడు ఆహారంతో పాటు.. రెస్టారెంట్‌ కూడా సంథింగ్‌ ఢిఫ్రెంట్‌ ఉండాలి. అసలే వచ్చినప్పటి నుంచి అందరూ తెగ ఫోటోలు తీసుకుంటారు.. అలాంటప్పుడు రెస్టారెంట్‌ క్రియెటివ్‌గా డిజైన్‌ చేసింది అయితే అక్కడ ఫుడ్‌ కంటే ఎక్కువ రెస్టారెంట్‌ హంగులకే జనాలు ఇంట్రస్ట్‌ చూపిస్తారు. అందుకు తగ్గట్టుగానే రెస్టారెంట్స్‌ను డిజైన్‌ చేస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయేది నెక్స్ట్‌ లెవల్‌ క్రియేటివిటి.. ఈ రెస్టారెంట్లో గాల్లో వేలాడాతూ తినొచ్చు.. ఏంటి..ఇదేదో తేడాగా ఉందే అనుకుంటున్నారా..? అసలు ఈ రెస్టారెంట్ ముచ్చటేందో మీరే చూడండి..!
మనాలిలో ఈ ప్రపంచంలోనే ఎత్తైన వేలాడే రెస్టారెంట్‌ ఉంది. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి అద్భుతమైన అందమైన కొండ ప్రాంతం. ఇక్కడ పారాగ్లైడింగ్, పర్వతారోహన, బంగి జంప్ వంటి సహసా క్రీడలు చేసేందుకు పర్యటకులు ఇష్టపడతారు. ఇవే కాదు అక్కడ మరో అద్బుతం కూడా ఉంది. అదే గాల్లో వేలాడే రెస్టారెంట్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాల్లో వేలాడే రెస్టారెంట్ ఇది.
ఓల్డ్ మనాలి రోడ్డులో ఉంది. భూమికి 165 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇందులో కూర్చుని తింటూ మనాలి అందాలను వీక్షించవచ్చు. ఇందులో 24 మంది అతిదులు, 4 స్టాఫ్ ఉండే సౌకర్యం కలిగించారు. ఇందులోని సీట్స్ గాల్లో వేలాడుతూ ఉంటాయి. రెస్టారెంట్ టేబుల్ సముద్ర మట్టానికి 2,250 మీటర్ల ఎత్తులో వేలాడుతూ ఉంటుంది. అందుకే దీన్ని ప్రపంచంలోనే ఎత్తైనదిగా పేర్కొన్నారు.
ఈ రెస్టారెంట్‌లో 5 రకాల ప్యాకేజీలు ఉన్నాయి. రోజు మొత్తం మీద 5 రైడ్స్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ రైడ్ మధ్యాహ్నం 1.30 నుంచి 2.15 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ సెకండ్ రైడ్ 3.30 నుంచి 4.15 వరకు లంచ్ సర్వ్ చేస్తారు.ఆ తర్వాత సాయంత్రం 5.15 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత రెస్టారెంట్ వాళ్ళు బ్రేక్ తీసుకుంటారు. మళ్ళీ రాత్రి 7.45 నుంచి 8.30 వరకు డిన్నర్ ఏర్పాటు చేస్తారు. ఇక చివరిగా 9 గంటల నుంచి 9.45 వరకు డిన్నర్ సర్వ్ చేసి క్లోజ్ చేస్తారు. అయితే కాస్ట్‌ ఎంత అనేది మాత్రం స్పష్టంగా చెప్పలేదు. మనాలి వెళ్లే ఆలోచనలో ఉంటే.. ఈ క్రేజీ రెస్టారెంట్‌ను మర్చిపోవద్దే..!
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news