డేట్‌ దాటిపోయిన మాత్రలు పడేస్తున్నారా..? ఆగండి వాటితో ఇలా చేయండి..!!

-

దాటిపోయిన మాత్రలు: ఎక్స్‌పైరీ డేట్‌ దాటిపోయిన ఏ వస్తువు అయినా మనం పడేస్తుంటాం.. వీటిని వాడటం వల్ల మళ్లీ ఏదైనా సమస్య వస్తుందేమో అన్న భయం.. ముఖ్యంగా ట్యాబ్లెట్లు అయితే అస్సలు ఛాన్స్‌ తీసుకోం.. అవి ఎన్ని ఉన్నా సరే… డేట్ దాటిందా తీసి చెత్తకుప్పలో వేస్తుంటారు.. ఇంట్లో ముసలి వాళ్లు ఉంటే.. మాత్రలు కచ్చితంగా ఉంటాయి.. ఏదో ఒక మాత్రలు వాళ్లు డైలీ వేసుకుంటారు.. ఆ క్రమంలో అవి ఎక్స్‌పైరీ అవడం కూడా కామన్‌.. మీరు డేట్‌ దాటిపోయిన మాత్రలను పడేయకుండా వాటితో ఇలా చేయొచ్చు.. వాటిని తిరిగి ఉపయోగించే ఒక చిట్కా ఉంది..? ఏంటి వాటిని కూడా వేసుకోవాలా అనుకుంటున్నారా..? లేదు.. వాటితో ఒక టీ చేసుకోవచ్చు.. అంటే ఇప్పుడు ఆ టీ తాగమంటున్నారా ఏంటి..? ఇదే కదా మీ డౌట్.. కాదండీ.. వాటితో ఏం చేయాలంటే..

 

గడువు ముగిసిన మందులు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ఔషధాల ఉపయోగం చాలా సమస్యల నుంచి బయటపడటానికి మీకు సహాయం చేస్తుంది. ముఖ్యంగా ఈ టిప్ మనకు ఇంట, వంటింట ఎంతో హెల్ప్ అవుతుంది. కాలం చెల్లిన మందులను పారేసే బదులు వాటిని ఎలా వాడాలో ఓ గృహిణి సోషల్ మీడియాలో వీడియో ద్వారా తెలిపింది.. గడువు ముగిసిన మాత్రలతో టీని తయారు చేయవచ్చు. ఈ టీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఒక పాత్రలో కొంత నీటిని తీసుకొని స్టప్‌పై పెట్టండి.. అందులో ఎక్స్‌పైర్‌ అయిన టాబ్లెట్‌ వేసి టీ పొడిని వేయాలి. టాబ్లెట్ నీటిలో కరిగిపోయే వరకు నీటిని వేడి చేయండి. తర్వాత మరో గిన్నెలో వడకట్టాలి. ఇలా ట్యాబ్లెట్స్ మరిగించిన నీటిలో కాటన్ నానబెట్టండి. ఆ తర్వాత ఇలా నానబెట్టిన కాటన్ బాల్‌ను వంటగది లేదా . చీమలు, బొద్దింకలు సంచరించే ప్రదేశంలో ఉంచాలి. ఎంత శుభ్రం చేసినా, పరిశుభ్రత పాటించినా చీమలు, బొద్దింకలు వస్తుంటాయి. అలాంటి ప్లేసులో ఈ బాల్స్‌ పెట్టారంటే.. అవి చనిపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news