బామ్మ.. నువ్వు కేక..మాస్ స్టెప్పులతో చించేసావు..

-

ఈరోజుల్లో యువత కొద్ది సేపు నడిస్తే అలసి సొమ్మసిల్లి పడి పోతున్నారు..కానీ బామ్మలు మాత్రం ఓ రేంజ్‌లో ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహం తో ఉరకలు వేస్తున్నారు.వాళ్ళ ఎనెర్జీ ముందు యువత వేస్టు అనే చెప్పాలి. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ లో బామ్మలు తెగ అల్లరి చేస్తూ, డ్యాన్స్లు వేస్తున్నారు.బామ్మలు వేస్తున్న డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఫుల్ లైకులు, కామెంట్లతో దూసుకుపోతున్నాయి.

ఏ వయసులోనా లైఫ్‌ని ఆనందమయం చేసుకోవచ్చు. మనతో పాటు తోటి వారికి కూడా ఆనందాల్ని పంచవచ్చు. 60 ఏళ్లు వచ్చాయంటే వారు ఔట్ డేటెడ్ అని ఫిక్సవుతారు చాలామంది..లేట్ వయస్సులోనూ తాము టాపే అని చెబుతుంటారు చాలామంది. తాజాగా 80 ఏళ్లు వయస్సులో కూడా తనకు ఏ రేంజ్ ఎనర్జీ ఉందో డ్యాన్స్ ద్వారా చూపించారు ఓ బామ్మ. పెళ్లి వేడుకలో 80 సంవత్సరాల బామ్మ హుషారుగా వేసిన స్టెప్పులు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.పెళ్లి కూతురు పక్కనే ఉండగానే, ఓ బామ్మ పెళ్ళి కొడుకుతో కలిసి స్టెప్పులు వేసింది.

డీజే టిల్లు టైటిల్‌ సాంగ్‌కు అదిరిపోయే మూమెంట్స్ వేసింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి గ్రామంలో జరిగిన బందువుల పెళ్లి వేడుకలో బామ్మగారు ఇలా స్టెప్పులు వేశారు. బామ్మ హుషారు చూసి..అక్కడున్న వారు అంతా ఆమెకు ఇంత ఎనెర్జి ఎక్కడి నుంచి వచ్చింది అంటూ నోర్లు వెల్లబెట్టారు. ప్రస్తుతం బామ్మ డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు అంటూ పట్టుమని 10 నిమిషాలు సరిగ్గా నిలబడలేని యూత్ ఈమెను ఆదర్శంగా తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news