బాయ్స్‌ ఇది మీకోసమే.. ఈ లక్షణాలుంటే అమ్మాయిలు త్వరగా ఇష్టపడతారట..!!

-

అమ్మాయి ప్రేమ అమ్మ ప్రేమ సమానం అంటారు. సమానమే ఎప్పుడంటే ఆ అమ్మాయి తన ప్రియుడ్ని మనస్పూర్తిగా ప్రేమించినప్పుడే. అమ్మాయిలు ఒక వ్యక్తిని వందశాతం ఇష్టపడటానికి చాలా సమయం పడుతుంది. ఒక్కసారి మనసివ్వడం స్టాట్‌ చేస్తే మర్చిపోవడానికి జన్మకూడా సరిపోదు. అంత ఘోరంగా లవ్‌ చేస్తారు. కాకపోతే వీళ్లకు కొన్ని ఫాంటసీలు ఉంటాయి. అబ్బాయి ఇలా ఉండాలి, అలా ఉండాలని. అలా వీళ్లు కోరుకున్న వాళ్లు దొరికేవరకూ ఎదురుచూస్తూనే ఉంటారు. ఈరోజు మనం అమ్మాయిలు పురుషుల్లో ఏ క్వాలిటీస్‌కి ఎక్కువగా యట్రాక్ట్‌ అవుతారో తెలుసుకుందాం..! అబ్బాయిలు ఇది మీకే..!!

అమ్మాయిలు కేరింగ్ నేచర్ ఉన్న అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతారు. ఇలాంటి అబ్బాయిల దొరికితే అమ్మాయిలు చాలా త్వరగా ప్రేమలో పడతారు. అబ్బాయిల కేరింగ్ స్వభావం అమ్మాయిలను వారి వైపు ఆకర్షిస్తుంది. ఎంత మందిలో ఉన్న తను మాత్రం నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు అనే భావన వాళ్లకు మీరు కలిగించాలి.

మహిళలు లేదా పురుషులు ఎవరైనా సరే, మీ భాగస్వామి అందంగా కనిపించాలని కోరుకోవడం సహజం. కానీ, మహిళలు అందం కంటే వ్యక్తిత్వానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పురుషుల మంచి వ్యక్తిత్వం అమ్మాయిలను ఇట్టే ఆకర్షిస్తుందట.

మనిషన్నాకా కూసింత రొమాంటిక్‌ సెన్స్‌ కూడా ఉండాలి. మరీ మొరటుగా రాయిలా ప్రవర్తిస్తే వీళ్లకు అస్సలు నచ్చదు. చిలిపి సరసాలు ఉండాలి.
అబ్బాయిల రొమాంటిక్ స్వభావం మహిళలను చాలా బాగా ఆకర్షిస్తుందట. తనని మాత్రమే ప్రేమించే అబ్బాయిలను ఇష్టపడని అమ్మాయి ఉండరు. ప్రత్యేక రోజుల్లో తన కోసం ఏదైనా ప్రత్యేకంగా చేస్తుంది అమ్మాయి, ఎంత చిన్నదైనా అతని కోసం తరచుగా బహుమతులు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది.

ప్రతి అమ్మాయి తన భాగస్వామి స్త్రీని గౌరవించే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటుంది. తన మనసును, భావాలను అర్థం చేసుకోవాలని ఆమె భావిస్తుంది. అటువంటి సున్నిత స్వభావం ఉన్న వ్యక్తిని చూడగానే అమ్మాయిలు తమ మనసును పారేసుకుంటారట.

ఏ అమ్మాయి అయినా కష్టపడి పనిచేసే అబ్బాయిలను ఇష్టపడతారు. తన భర్త బాగా సంపాదించాలి, ఎవరికీ చేయి చాపకూడదని ఆశిస్తుంది. పెద్దలు తమ కోసం ఏమి చేసినా జీవితంలో ఏదో సాధించాలని భావించే పురుషులకు మహిళలు చాలా త్వరగా పడిపోతారు

కొంతమంది అబ్బాయిలు అస్సలు చెప్పేది వినరు. పట్టించుకోరు. ఇలా ఉంటే అమ్మాయిలకు అస్సలు నచ్చదు. మనం ఏం చెప్పినా ఫస్ట్‌ పూర్తిగా వినాలి. మన వర్షన్‌ ఏంటో తెలుసుకోవాలి. అలా కాకుండా వాళ్లుకు వాళ్లే సొంత నిర్ణయాలు తీసుకుని అమ్మాయిలు చెప్పేది వినకుండా ఉంటే వీళ్లకు కాల్తుంది. పరిస్థితులను బట్టి ఒకరి మాట ఒకరు వినాలి. అప్పుడే ఆ బంధం కలకాలం కలహాలు లేకుండా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version