కమెడియన్ ఇంట్లో రూ.2వేల రూపాయల నోట్ల కట్టలు.. మంచు విష్ణు ట్వీట్ వైరల్..

-

టాలివుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ ఇంట్లో కుప్పలుగా 2000 నోట్లు కనిపించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.. అయితే ఈ ఫోటోలను స్వయంగా మంచు విష్ణు సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది.. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఇటీవలే భారత ప్రభుత్వం 2000 రూపాయల నోట్లను బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టాలీవుడ్ నటుడు మంచు విష్ణు.. నేను వెన్నెల కిషోర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కుప్పలు కుప్పలుగా రూ. 2000 నోట్లను చూసాను.

ఆ నోట్లను చూసి ఆశ్చర్యపోయి ఫోటో తీసాను. ఆయన ఈ నోట్లను ఎం చేస్తారో అంటూ ఆ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఈ ఫోటో కాస్త వైరల్ అవడంతో ఈ వార్త దుమారం రేపుతుంది.. ఈ వార్త పై వెన్నెల కిషోర్ స్పందిస్తూ… నామీద పడతారేంటీ అంటూ కామెంట్ చేశాడు..అయితే.. మంచు విష్ణు షేర్ చేసిన ఈ ఫోటోలు నిజమేనా? లేక వెన్నెల కిషోర్ ను ఆటపట్టించడానికి ఇలా చేశాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక మంచు విష్ణు, వెన్నెల కిషోర్ ముందు నుండే మంచి ఫ్రెండ్ అన్న సంగతి తెల్సిందే…

అయితే ఇది నిజం కాదని కూడా మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి.. మంచు విష్ణు ఇదంతా కావాలని చేసినట్లు ఓ వార్త షికారు చేస్తుంది.. ఫెమస్ అవ్వడానికే అపద్దపు ప్రచారం చేసినట్లు సమాచారం.. ఒక కమెడియన్ ఇంట్లో ఇంత డబ్బులు ఉండటం అసాధ్యం.. విష్ణు కు కొంచెం కూడా బుద్దిలేదు అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.. అసలు విషయం ఏంటనేది తెలియదు కానీ ఈ వార్త ఇంకా ప్రచారం జరుగుతుంది.. అసలు మ్యాటర్ ఏంటో తెలియాలంటే కిషోర్ నోరు విప్పేవరకు ఆగాల్సిందే.. ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఫోటో సోషల్ మీడియాలో తీవ్ర చర్చలకు దారి తీస్తుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version