దేవుడా..ఇదేం పిజ్జా రా బాబు.. వీడియో చూస్తే అస్సలు తినరు..

-

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదొక వీడియో వైరల్ అవుతుంది.డ్యాన్స్,పాటలు మాత్రమే కాదు..కుకింగ్ కు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. వెరైటీ పేరుతో కొత్త కొత్త వంటలు చేస్తూ రచ్చ చేస్తున్నాయి. ఐస్ క్రీమ్ మ్యాగీ,కొకొకొలా మ్యాగీ ఇలా ఎన్నో రకాల వంటలు మొన్నటిదాకా చక్కర్లు అయ్యాయి. తాజాగా మరో కొత్త వంట వీడియో ట్రెండ్ అవుతుంది.

ఇప్పుడు ఓ వ్యక్తి పిజ్జాతో కూడా వెరైటీ ఫుడ్ ట్రై చేశాడు. అతడి చర్యను చూసిన పిజ్జా ప్రియులు తమ కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నారు. పిజ్జా పేరు వినగానే నోట్లో నీళ్లూరుతాయి. జున్ను, మొక్కజొన్న, పుట్ట గొడుగులు, పనీర్‌తో తయారైన ఈ పదార్థాన్ని తినేందుకు భోజన ప్రియులు ఆసక్తి కనబరుస్తున్నారు.. రోజు రోజుకు ఆ పిజ్జాకు డిమాండ్ కూడా పెరుగుతుంది.. తక్కువ ధర కావడంతో ఎక్కువ మంది తింటున్నారట..

నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో లో ఓ వ్యక్తి పిజ్జా సాస్‌కు బదులుగా చాక్లెట్, చీజ్‌కు బదులుగా ఐస్‌క్రీమ్ వేసి పిజ్జా తయారు చేశాడు. మొదట చాక్లెట్ సాస్‌ను పిజ్జా బేస్‌పై అప్లై చేసి, ఆపై కూరగాయల ను పెడతాడు. దీనిని ఓవెన్ లో ఉంచి, పిజ్జా తయారు చేస్తాడు. అనంతరం పిజ్జాపై వెనిల్లా ఐస్ క్రీం, స్ట్రాబెర్రీ ఐస్ క్రీం యాడ్ చేస్తాడు. ఈ వీడియో ను రేడియోకా రోహన్ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనిని వేలాది మంది వీక్షించగా చాలా మంది లైక్ చేశారు. వైరల్ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘తిండిని వదిలేయండి, ఇది చూడటానికి అసహ్యంగా ఉంది’ అని మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు.. మీరు ఆ వైరల్ వీడియోను ఒకసారి చూడండి..

 

View this post on Instagram

 

A post shared by RJ Rohan (@radiokarohan)

Read more RELATED
Recommended to you

Latest news