అదృష్టం ఎప్పుడు ఎవరి ఇంటి తలుపు తడుతుందనేది చెప్పలేము..రూపాయి పెడితే పది రూపాయలు రావడం గ్రేట్..అలాగే కోట్లు రావడం కూడా వినే ఉంటాము..ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాము అంటే ఓ వ్యక్తిని సోడా అతని జీవితాన్నే మార్చింది.సోడా కొనుగోలు చేసేందుకు షాప్‌కు వెళ్లిన ఓ యువకుడని అదృష్టం వరించింది.ఒకటి రెండు కాదు ఏకంగా కోట్లకు అధిపతిని చేసింది.దీంతో ఈ వార్త స్థానికంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. కాగా.. ఇంతకూ ఆ లక్కీ పర్సన్ ఎవరు.. లాటరీలో అతడు ఎంత గెలుచుకున్నాడు? వివరాల్లోకి వెళితే..
అగ్రరాజ్యం అమెరికాలోని వర్జీనియా రాష్ట్రానికి చెందిన జోస్ ఫ్లోర్స్ వెలాస్క్వెజ్ అనే యువకుడు.. సుమారు నెల రోజుల క్రితం స్థానికంగా ఉన్న సూపర్ మార్కెట్ వెళ్లాడు. అక్కడ సోడా కొనుగోలు చేసి, స్క్రాచర్ గేమ్‌లో పాల్గొని, ఓ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. ఇంతలోనే నెల రోజులు గడిచిపోయాయి. లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసిన విషయాన్ని కూడా అతడు మర్చిపోయాడు. ఈ క్రమంలోనే లాటరీ నిర్వాహకుల నుంచి అతడికి ఫోనొచ్చింది.
నువ్వు కొన్న సోడాకు లాటరీ తగిలింది అని చెప్పారు.సంతోషించిన జోస్ ఫ్లోర్స్.. 600 డాలర్లు (సుమారు రూ.47వేలు) గెలుచుకుని ఉంటానని భావించాడు. అంతేకాకుండా.. గెలిచిన డబ్బులు తెచ్చుకోవడానికి వాళ్లు రమ్మన్న చోటుకి బయల్దేరి వెళ్లాడు. తీరా అక్కడకు వెళ్లాక గానీ జోస్ ఫ్లోర్స్‌కు అసలు విషయం తెలియలేదు. తాను ఏకంగా ఒక మిలియన్ డాలర్లు(దాదాపు రూ.7కోట్లు) గెలుచుకున్న విషయాన్ని తెలుసుకున్నాడు..ఎగిరి గంతేశాడు. గెలిచి డబ్బుతో సొంతంగా బిజినెస్‌ను మొదలు పెడతానని ఈ సందర్భంగా అతడు చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. విన్నింగ్ టికెట్‌ను విక్రయించినందుకు.. సూపర్ మార్కెట్‌కు కూడా 10వేల డాలర్లు కూడా అదనంగా లభించాయి.. మొత్తానికి అతడు ఒక సోడాతో కోట్లు సంపాదించాడు..రాత్రికి రాత్రే కోట్లకు అధిపతి అయ్యారు..ఇలాంటివి ఎక్కడో ఒక చోట వినిపిస్తున్నాయి..రాసి పెట్టి ఉంటే ఎప్పుడోక చోట,ఎక్కడో చోట జరుగుతూ ఉంటాయి..