మెదడు సైజును బట్టి ఆవలింత సైజు ఉంటుందట మీకు తెలుసా..! ఇంకా..

-

డైలీ ఏదో ఒక కొత్త ముచ్చట తెలుసుకోందే కొంతమంది అస్సలు పొద్దుపోదు.. అది వాళ్లకు పనికొచ్చేది కాకపోయినా.. కొత్త విషయాలు తెలుసుకోవాలంటే.. ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మీకోసమే కదా.. మేము కూడా ఈ జిందగీలా గమ్మత్తైన ముచ్చట్లను ఇస్తున్నాం.. అందులో భాగంగా ఈరోజు.. క్రేజీ ఫ్యాక్ట్స్ ఏంటంటే.. అతి వేగంగా వెళ్తే ఎక్కడైనా ఫైన్ వేసి లొల్లి చేస్తారు..కానీ అక్కడ తక్కువ స్పీడ్ లో వెళ్తేనే కేసు నమోదు చేస్తారట. ఇంకా మరన్నీ విషయాలు …
లాలాజలం లేకపోతే… మనుషులు ఆహారాన్ని రుచి చూడలేరట.
రోదసిలో ఉన్నప్పుడు వ్యోమగాములు ఎత్తు ఎక్కువగా పెరుగుతారట.
ప్రపంచంలో మకరోనీ, వెన్నను ఎక్కువగా కెనడా ప్రజలు తింటున్నారు
ఫిబ్రవరి 18, 1979లో సహారా ఎడారిలో 30 నిమిషాలపాటూ మంచు కురిసింది.
స్విట్జర్లాండ్‌లో రాత్రి 10 తర్వాత టాయిలెట్‌ని ఫ్లష్ చెయ్యడం చట్ట విరుద్ధం..
యాపిల్, పీచ్, రాస్ బెర్రీ పండ్లు.. గులాబీ జాతికి చెందినవి. అలాగే స్ట్రాబెర్రీ.. బెర్రీ కాదు.. అరటిపండు బెర్రీయే. ఈ విషయం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేయొచ్చు కదా..!
భూకంపాలను పాములు 120 కిలోమీటర్ల అవతల ఉండగానే గుర్తించగలవు. ఇవి 5 రోజుల ముందుగానే భూకంపం రాబోతోందని తెలుసుకొని.. అక్కడి నుంచి జారుకుంటాయి. వామ్మో పాములు భలే తెలివైనవి కదా..!
ప్రేమికుల రోజు నాడు దక్షిణ కొరియాలో అమ్మాయిలే గిఫ్ట్స్ ఇస్తారు. అబ్బాయిలు ఇవ్వరట.. అబ్బా సాయిరాం.. పైసల్ మిగిలినట్లే కదా అబ్బాయిలకు.!
ప్రింగిల్స్ (Pringles) సృష్టికర్త ఫ్రెడ్‌రిక్ బార్ (Fredric Baur) 2008లో చనిపోయాడు. ఆయన కోరిక ప్రకారమే ఆయన్ని ప్రింగిల్స్ క్యాన్‌లో సమాధి చేశారు పిల్లలు.
బ్రెయిన్ సైజును బట్టీ ఆవలింత సైజ్ ఉంటుంది. చిన్న మెదడు ఉన్న ప్రాణులకు చిన్న ఆవలింత వస్తుంది. పెద్ద మెదడు ఉన్న జీవులకు పెద్దగా వస్తుంది.
వారానికి 3 గంటలపాటూ వీడియో గేమ్స్ ఆడే సర్జన్లు… ఆడని వారి కంటే 27 శాతం ఎక్కువ వేగంతో… 37 శాతం తక్కువ తప్పులతో సర్జరీలు చేయగలరుట.
బహమాస్‌లో మనుషులు తిరగని దీవి ఒకటుంది. అదే పిగ్ బీచ్ (Pig Beach). అక్కడ పందులు ఈత కొడుతూ ఉంటాయట.
కాలిఫోర్నియాలో వెళ్లాల్సిన వేగం కంటే చాలా తక్కువ వేగంతో బండి నడిపితే.. కేసు నమోదై.. టికెట్ వస్తుందట.
తన అస్థిపంజరాన్ని ఎవరూ కదపకుండా ఉండేందుకు విలియం షేక్‌స్పియర్.. తన సమాధి రాయిపై ఓ శాపాన్ని రాయించుకున్నాడు.
రాక్షసబల్లులు (Dinosaurs) భారీ రాళ్లను మింగేసేవి. ఆ రాళ్లు కడుపులో ఉండి… ఆహారం అరిగేందుకు ఉపయోగపడేవట.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news