హోటల్లో ఎక్కువగా తింటున్నారా?ఇది చూస్తే జీవితంలో తినరు..

-

చాలా మంది ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్తూన్నారు.. అయితే లంచ్ బాక్స్ తీసుకొని వెళ్లడానికి టైం లేక బయట హోటల్లో తింటారు. కడుపునిండా భోజనం తిన్నామా లేదా అని చూస్తున్నారు తప్ప సుచి,శుభ్రత గురించి మాత్రం పెద్దగా పట్టించుకోరు.దాంతో హోటల్ నిర్వాహకులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు.కాసుల కక్కుర్తి తో మనుషుల ప్రాణాలను ఖేతార్ చేస్తున్నారు.. కొన్ని హోటల్ పై అధికారులు వేటు వేస్తున్నారు..ఇప్పటికే ఎన్నో హోటల్స్ ను సీజ్ చేశారు.

హోటళ్లు, స్వీట్‌ షాపుల ఓనర్లు. కొనుగోలుదారుల ఫిర్యాదు మేరకు తనిఖీలు చేశారు మున్సిపల్‌ అధికారులు.పైన పటారం లోన లొటారం అన్న తీరుగా ఉన్నాయి రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణంలోని బేకరీలు, హోటళ్లు, స్వీట్‌ షాపులు. చూడడానికి ఎంతో అందంగా ఉన్నా కానీ, మెయిన్‌టెన్స్‌ చెత్తగా ఉండటంతో మున్సిపల్‌ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ పరిధిలో ఉన్న అన్ని హోటళ్లలో తనిఖీలు చేపట్టారు.

కస్టమర్లు తిన్న వాటిని చెత్తడబ్బాలో వేయకుండా షాపు ముందే పడేయడంతో కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల్లో భాగంగా బస్టాండ్‌ ఎదురుగా ఉన్న ఓ స్వీట్‌ షాపులోని నూనె డబ్బాలో, చచ్చిపడి ఉన్న ఎలుకను గమనించిన అధికారులు షాపును సీజ్‌ చేశారు. అలాగే ప్లాస్టిక్‌ కవర్లను వాడుతున్న షాపుల వారికి అవగాహన కల్పిస్తూ.. మరోసారి కనిపిస్తే జరిమానాలు విధిస్తామని వార్నింగిచ్చారు.

అన్ని షాపుల్లో ప్లాస్టిక్‌ కవర్లు వాడుతున్నారు. వీరికి జరిమానాలు వేస్తేనే వాడకుండా ఉంటారని ప్రజలు కోరుకుంటున్నారు. షాద్‌నగర్‌ పట్టణమే కాదు తెలంగాణల ఎక్కడ చూసిన ప్లాస్టిక్‌ కవర్ల వాడకం తగ్గలేదు. అన్ని ఏరియాల్లోని మున్సిపల్‌ అధికారులు తనిఖీలు చేస్తే ప్రజలు ఆరోగ్యం బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు..ప్లాస్టిక్‌ వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.. ఇలాంటి వాటి పై అధికారులు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news