పదే పదే మీ మధ్య గొడవలు వస్తున్నాయా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి..!

-

ప్రతి ఇద్దరి మధ్య కూడా ఏదో ఒక చిన్న కారణం వలన కానీ లేదంటే పెద్ద కారణం వలన కానీ గొడవలు వస్తూ ఉంటాయి. స్నేహంలో అయినా ప్రేమలో అయినా భార్యాభర్తల మధ్య అయినా ఇది సర్వసాధారణం. అయితే ఎప్పుడైనా సరే ఏదైనా సమస్య కలిగితే దానిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ కనుక దానిని మీరు బ్యాలెన్స్ చేసుకోకపోతే జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

రిలేషన్ షిప్ లో ఏదైనా ఇబ్బంది కలిగితే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ సహనాన్ని కూడా కోల్పోయి ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని రిలేషన్షిప్ ని ముక్కలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. భార్యాభర్తల మధ్య కానీ ప్రియుడు ప్రేయసి మధ్య కానీ గొడవలు వస్తున్నట్లయితే ఇలా సాల్వ్ చేసుకోండి. అప్పుడు కచ్చితంగా తిరిగి మళ్ళీ మీ రిలేషన్షిప్ ని మీరు అందంగా మార్చుకోవచ్చు. కలకాలం కలిసి ఆనందంగా జీవించొచ్చు.

తరచు మీ మధ్య గొడవలు వస్తుంటే ఇలా చేయండి:

మీరు నమ్మే వ్యక్తితో మీ సమస్యను చెప్పండి:

మీరు ఇద్దరు నమ్మే వ్యక్తితో ఒకసారి మీ సమస్యని చెప్పండి ఆ తర్వాత మీకు మంచి పరిష్కారాన్ని ఆ వ్యక్తి చూపిస్తాడు. మీరు చేసిన తప్పు ఏంటో కూడా మీకు తెలుస్తుంది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.

కమ్యూనికేషన్:

కమ్యూనికేషన్ చాలా అవసరం. ఏ రిలేషన్ షిప్ లో అయినా కూడా కమ్యూనికేషన్ బాగుండాలి మంచి కమ్యూనికేషన్ లేకపోతే రిలేషన్షిప్ దెబ్బతింటుంది. సమస్యలు వస్తున్నప్పుడు కూడా మాట్లాడుకోవాలి చాలా మంది సమస్యలు ఎక్కువ ఉన్నాయని మాట్లాడకపోవడమే మంచిదని భావిస్తారు అది నిజంగా ప్రమాదకరం దీని వలన సమస్యలు పెరుగుతాయి. కాని తరగవు.

కాస్త బ్రేక్ తీసుకోండి:

ఎప్పుడు ఆవేశం లో నిర్ణయం తీసుకోకండి ఒకసారి బ్రేక్ తీసుకుని ఫ్రెష్ గా ఆలోచించండి అప్పుడు కచ్చితంగా మీ రిలేషన్ బాగుంటుంది.

మీకు ఏది మంచిదో అదే చేయండి:

మీకు ఏది మంచిదనిపిస్తే అదే చేయండి చాలామంది సర్దు చెప్పుకొని లేదంటే ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనో కాదు.. మీకు ఏది మంచిది అయితే అదే చేయండి ఈ విధంగా మీరు అనుసరిస్తే మీ రిలేషన్షిప్ బాగుంటుంది మీ మధ్య గొడవలు ఇబ్బందులు కలగవు.

Read more RELATED
Recommended to you

Exit mobile version