మనకి మంచి అలవాట్లు ఉంటే మంచిగా ఉంటాం. చెడు అలవాట్లు ఉంటే మనకు చెడే కలుగుతూ ఉంటుంది. నిజానికి మంచి దారిలో వెళితే తప్పకుండా విజయం సాధించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మంచి అలవాట్లను అలవరచుకోవాలి.
అప్పుడే మనం దేనిలోనైనా సక్సెస్ అవగలము. నిజానికి చెడు అలవాట్లు ఉంటే మనిషి మరింత దిగజారి పోతాడు. కానీ సక్సెస్ పొందలేరు. ఈ అలవాట్లు కనుక మీలో ఉన్నాయి అంటే కచ్చితంగా మీరు సక్సెస్ అవ్వచ్చు అని చాణక్య నీతి లో ఆచార్య చాణక్య తెలిపారు. మరి ఆచార్య చాణక్య చెప్పిన విషయాలను ఇప్పుడు చూద్దాం.
సోమరితనం వద్దు:
బద్ధకం వల్ల మనిషి విజయం సాధించలేరు అని చాణిక్యనీతి అంటోంది. సోమరితనం వల్ల చేతులారా వచ్చిన అవకాశాలను కూడా వినియోగించుకో లేరు. కాబట్టి అస్సలు సోమరితనం లేదు అంటే కచ్చితంగా విజయం సాధించవచ్చు.
సమయానికి ప్రాముఖ్యతను ఇవ్వడం:
సమయం ఎంత విలువైనదో అందరికీ తెలుసు కానీ చాలా మంది దాన్ని అస్సలు పట్టించుకోరు. మీరు కనుక సమయం విలువని గుర్తించారు అంటే కచ్చితంగా మీరు సక్సెస్ అవ్వచ్చు.
కష్టపడడానికి భయపడకండి:
కష్ట పడాలంటే చాలా మంది భయపడుతుంటారు. కష్ట పడితే కచ్చితంగా విజయం సాధించడానికి అవుతుంది. నిజానికి శ్రమ పడకుండా ఏదీ రాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం:
మత్తు పదార్థాలకు దూరంగా ఉండే వాళ్ళు కూడా సక్సెస్ అవ్వగలరు. మత్తు పదార్థాలు అలవాటు ఉంటే జీవితంలో అన్నీ అనవసరంగా కోల్పోవాల్సి వస్తుంది ఈ విజయం కూడా మీ చెంత చేరదు.