పిల్లులు కేవలం వినికిడితోనే వాటి యజమానిని గుర్తిస్తాయట తెలుసా..!

కుక్కలు అయితే తమ యజమానికి గుర్తుపడతాయ్, చూసినప్పుడు స్పందిస్తాయి అని మనకు తెలుసు. ఈరోజుల్లో చాలామంది కుక్కలతో పాటు పిల్లలను కూడా పెంపుడు జంతువుగా పెంచుకుంటున్నారు. అయితే అందరూ కుక్కలు ఉన్నంత ప్రేమగా, అవి ఉన్నంత యాక్టీవ్ గా పిల్లలు ఉండవని అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదట. నూతన పరిశోధనల ప్రకారం పిల్లులు తమ యజమానులను ఎక్కడ ఉన్నారని ఆలోచిస్తాయట, ఇంకా ఈ పరిశోధనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ఏంటంటే..

ఈ నూతన పరిశోధనల పిల్లులు తమ యజమానులు ఎక్కడ ఉన్నారోననే ఆందోళన ఎక్కువగా కలిగి ఉంటాయట. అంతేకాదు పిల్లులు సామాజిక–ప్రాదేశిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అవి లేనప్పుడు కూడా యజమానుల కదలికలను ట్రాక్‌ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని అధ్యయనం కనుగొంది. భలే ఇంట్రస్టింగ్ గా ఉందికదూ.

కుక్కల్లా పిల్లులు తమ యజమానులను పట్టించకోవనే ప్రస్తుత నమ్మకాన్ని ఈ అధ్యయనం కాదని నిరూపించాయి. పిల్లులు ఇంట్లో తిరుగుతున్నప్పుడు వాటి యజమానిని ట్రాక్‌ చేయడం కనిపించిందని, వారు ఎక్కడ ఉన్నారో ఊహించని విధంగా కనుగొనడం ఆశ్చర్యరానికి గురిచేసిందని అధ్యయనం తెలిపింది

పిల్లులు యజమానుల లేని ఉనికిని కూడా గుర్తుంచుంకుంటాయని.. జపాన్‌లోని క్యోటో విశ్వవిద్యాలయంలోని డాక్టరల్‌ విద్యార్థి అయిన సాహో తకాగి సీఎన్‌ఎన్‌కి చెప్పారు.

తనకు పిల్లులంటే ప్రత్యేక ప్రేమ. వాటికి సున్నితమైన చెవులు ఉంటాయని వాటి వినికిడిపై తనకు ప్రత్యేక ఆసక్తి ఉందని తకాగి తెలిపారు. వివిధ ధ్వనులకు పిల్లులు ఎలా స్పందిస్తాయో గమనించడానికి ఆయన ఇంట్లో.. ఇతర పరిశోధకులతో ఒక పరిశోధనను చేశారు. ఇందులో పలు చోట్ల స్పీకర్లు ఏర్పాటు చేశారు. పిల్లులు తమ యజమానుల పేర్లను విన్నప్పుడు ఎలా స్పందిస్తాయో కూడా పరిశోధకులు చూశారు.పరిశోధకులు స్పీకర్లపై రాండమ్ గా ఎలక్ట్రానిక్‌ శబ్దాలు, కొన్ని తెలియని శబ్దాలను ప్లే చేశారు. కానీ, పిల్లులు ఏవీ వాటిపై ఆసక్తి చూపలేరు. కానీ, వాటి యజమాని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశం వైపునకు వెళ్లడాన్ని ఆశ్చర్యకరంగా గమనించాయట.

కాబట్టి పిల్లులు మిమ్మల్ని పట్టించుకోవని, మీ మీద ప్రేమ చూపించవని అనుకోకండి..పాలు పోసీ ప్రేమగా పెంచే యజమానిని పిల్లులు తప్పక ప్రేమిస్తాయి. మీ ఆత్మీయుల్లో ఎవరైనా పిల్లులను పెంచుతుంటే ఈ ఆర్టికల్ షేర్ చేసేయండి.