జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మహబూబా ముఫ్తీ పాకిస్తాన్ న్యాయ వ్యవస్థను ప్రశంసించారు. మూక దాడుల్లో ఒక వ్యక్తిని కొట్టి చంపిన నిందితులుగా ఉన్న ఆరుగురికి పాక్ కోర్ట్ మరణ శిక్ష విధించిందని…12 మందికి జీవిత ఖైదు విధించిందని… అయితే 2015 నుంచి ఇప్పి వరకు ఇండియాలో ఎంత మందికి శిక్షలు పడ్డాయని ప్రశ్నించారు. కుల్గామ్ పార్టీ సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో శిక్షలు ఉండవని… పూలమాల వేస్తారని.. ఇదే ఇండియా న్యాయవ్యవస్థకు, పాక్ న్యాయవ్యవస్థకు ఉన్న తేడా అని విమర్శించింది.
బీజేపీ మతపరమైన సెంటిమెంట్ రెచ్చగొట్టడం తప్పితే ఏం చేయలేదని.. యువతకు ఉద్యోగాలు రావని.. ధరలు పెరుగుతున్నాయి.. రెండు పూటల భోజనం దొరక్క ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని… ప్రజల ఖాతాలో 15 లక్షలు వేస్తామని చెప్పి రైతుల నుంచి తిండి గింజలు లాక్కున్నారని విమర్శించారు. ముస్లిలను, వారి ప్రార్థన స్థలాలను టార్గెట్ చేసి హిందూ- ముస్లింల మధ్య సమస్యలను లేవనెత్తుతున్నారని అన్నారు. మీరు ముస్లింలను ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం తన ఖండఖావరాన్ని నిలిపి వేస్తే తప్పా కాశ్మీర్ లో రక్త పాతం అంతం కాదని ఆమె అన్నారు. అరెస్ట్ లు వేధింపులు లేకపోతే కాశ్మీర్ లో రక్తపాతం ఉండదని ఆమె అన్నారు.