T- షర్ట్‌లో T అంటే ఏంటో తెలుసా..? ఇంట్రస్టింగ్‌ విషయం మీకోసం..!

-

ఇప్పుడున్న ఫ్యాషన్‌ ప్రపంచంలో రకరకాల దుస్తులు.. ఒక్కోటి ఒక్కో రకమైన స్టైల్.. జీన్స్‌ ప్యాయింట్స్‌లో అయితే ఎన్నో వైరైటీలు. అయితే వీటికి ఆ పేర్లు, వాటి చరిత్ర చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇప్పుడు రిప్పడ్‌ జీన్స్ అంటే.. స్టైల్‌ ఐకాన్. కానీ అవి ఎందుకు తయారు చేశారో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. అలాగే టీ షర్ట్స్‌ కూడా.. టీ షర్ట్‌లో టీ అంటే ఏంటో ఎప్పుడైనా మీరు ఆలోచించారు. షట్‌ మీద టీ పోస్తే అది టీ షట్‌ అవుతుందని మనం ఫన్నీగా అనుకుంటాం. కానీ ఆ టీ వెనుక ఒక చిన్న స్టోరీ ఉందట.. అదేంటంటే..!!

నిపుణుల అభిప్రాయం ప్రకారం, T- షర్టులో T అనే పదం అర్థం రెండు విధాలుగా ఉద్భవించింది. మొదటిది T- షర్టు ఆకారం T వలె ఉంటుంది. దీనికి కాలర్ కూడా ఉండదు. ఇది చాలా సాధారణ వస్త్రం. దీనిని ముందు లేదా వెనుక నుంచి చూస్తే, అది T ఆకారంలో కనిపిస్తుంది. బహుశా అందుకే దీనికి టీ-షర్ట్ అని పేరు వచ్చిందని అంటారు.

ఇక రెండో రీజన్‌ ఏంటంటే.. టీ-షర్ట్ పేరుకు మరో ఆసక్తికరమైన కారణం ఇచ్చారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో, అమెరికన్ సైనికులు శిక్షణ సమయంలో చాలా తేలికపాటి బట్టలు ధరించేవారు. ఈ బట్టలు నేటి టీ-షర్టుల మాదిరిగానే ఉన్నాయి. వాటిని ట్రైనింగ్ షర్ట్స్ అని పిలిచేవారు. ఈ శిక్షణా చొక్కాను షార్ట్‌గా T- షర్టు అని పిలిచే వారు.

T- షర్టు వలె కనిపించే చొక్కా మాత్రమే T- షర్టు అని పిలుస్తారు. అయితే అమెరికా సైనికుల విషయాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయలేం కదా. నేటి కాలంలో, టీ-షర్ట్ అనేది చాలా సాధారణమైన వస్త్రం.. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ వేసుకుంటున్నారు. ఇంకా ఇది చాలా కంఫర్ట్‌ కూడా. ఆఫీసులకు, ఇంట్లో ఉండేప్పుడు కూడా ఇవి వేసుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news