మంచు ముక్కలు, పెన్సిళ్లు, పెయింట్ తినాలనిపిస్తుందా.. కారణం ఇదే.!

మనకు శరీరంలో సరిపడా వాటర్‌ కంటెంట్‌ ఉండాలి.. అంతే బ్లడ్‌ కూడా ఉండాలి. వాటర్‌ లేకపోతే డీహైడ్రేట్‌ అవుతాం..బ్లడ్‌ లేకపోతే రక్తహీనత భారిన పడతాం. అయితే డీహైడ్రేట్‌ అయితే తెలిసిపోతుంది. కానీ బ్లడ్‌ లేకపోతే అది రక్తహీనత అని తెలుసుకోవడం అంత ఈజీ కాదు. బాడీలో రక్తం ఎంత ఉండాలో అంత ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం..అప్పుడే అన్ని అవయవాలకు రక్తం సరిగ్గా అందుతుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉంటే హిమగ్లోబిన్‌ ఉత్పత్తికి కావాల్సిన ఐరన్ లోపించడం వంటి సమస్యలు ఏర్పడతాయి. మనలో చాలా మంది శరీరంలో సరిపడ రక్తం ఉందా.? లేదా.? అనే డౌట్‌ ఉంటుంది. మన శరీరంలో కనిపించే కొన్ని లక్షణాల ఆధారంగా రక్తం సరిపడా ఉందో తెలుసుకోవచ్చు..మరీ ఆ లక్షణాలు ఏంటంటే..

శరీరంలో సరిపడ రక్తం లేకపోతే చిన్న పనులకే బాగా అలసి పోతుంటారు.
రక్తహీనత ఉన్నవారికి మంచు ముక్కలు, పెన్సిళ్లు, పెయింట్, గోడకు రాసిన సున్నం వంటి వాటిని తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే రక్తహీనత ఉందనే నిర్ధారణకు రావొచ్చు.
కొందరిలో శరీరం నిత్యం చల్లగా ఉంటుంది. అలాంటి వారిలో రక్త హీనత సమస్య ఉందని అనుమానించాల్సిందే…
చర్మం పాలిపోయి తెల్లగా కనిపిస్తుంది. ఇలాంటి వారు కూడా వెంటనే పరీక్ష చేయించుకోవాలి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంటుంది.
పెదవులు, చిగుళ్లు, కనురెప్పల లోపల ఎరుపు తగ్గడం. ఇలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే అప్రమత్తం అవ్వాలి.
కండరాల నొప్పులు, నిత్యం ఏదో తెలియని ఆందోళన ఉన్నా రక్తహీనతగా భావించాల్సిందే.
ఇక నిత్యం తలనొప్పితో బాధపడేవారిలో కూడా రక్త హీనత సమస్య ఉండే అవకాశాలు ఉంటాయి.
మహిళలకు అయితే పిరియడ్స్‌లో బ్లీడింగ్‌ ఎక్కువగానే అవుతుంది. అలాంటప్పుడు కూడా బాడీలో సరిపడా రక్తం లేదనే అర్థం.. రక్తం తక్కువగా ఉంటే.. ఆకుకూరలు బాగా తినాలి. ముఖ్యంగా బచ్చలకూర గట్టిగా తింటే..రక్తం బాగా పడుతుంది. గోధుమ గడ్డి రసం గ్లాసు తాగితే.. గ్లాసు రక్తం తాగిన దాంతో సమానమే.. అంత బాగా పోషకాలు ఉంటాయి. ఇక బెల్లం కూడా రోజు ఒక ముక్క తింటూ ఉంటే.. బాడీకి రక్తం పడుతుంది. అన్నింటికంటే ముందు మీకు చెప్పిన లక్షణాలు ఉంటే.. పరీక్షించుకోండి. ఆ తర్వాత ఈ చిట్కాలు పాటించవచ్చు.!