1.5 లీటర్ల కూల్‌ డ్రింక్‌ ఒకేసారి తాగాడు.. కానీ 18 గంటల్లోనే

-

మనం చాలా హోటళ్లలో చూసే ఉంటాం.. 50 గుడ్లు లేదా పరోటాలు ఒకేసారి తింటే బిల్ కట్టక్కర్లేదు అని. ఇలాంటి ఆఫర్స్ చూస్తాం కానీ పెద్దగా మనం అందులో పాల్గొనం కదా.. ఎందుకంటే బిల్ సంగతి దేవుడెరుగు అన్ని ఒకేసారి తింటే ఆరోగ్యం దెబ్బతినటం కాయం. కానీ ఒక వ్యక్తి పాపం ఎండవేడిని తట్టుకోలేక ఒకేసారి లీటన్నర కూల్ డ్రింక్ తాగేశాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందంటే..

చైనాకు చెందిన 22 ఏళ్ల యువకుడు గత నెలలో ఎండ వేడిని తట్టుకోలేక ఒకే సారి 1.5 లీటర్ల కోకాకోలా తాగేశాడు. అయితే తాగిన 6 గంటల్లోనే తీవ్రమైన కడుపునొప్పి, ఉబ్బరం సమస్యలు రావటంతో.. బీజింగ్‌లోని చావోయాంగ్‌ హాస్పిటల్‌కు అతన్ని తరలించారు. చికిత్స సమయంలో రక్తపోటు అధికంగా పడిపోవటంతో.. గుండె వేగంగా కొట్టుకుందని, ఊపిరి వేగం కూడా పెరిగిందని వైద్యులు తెలిపారు. ఇవన్నీ గమనించిన తర్వాత డాక్టర్లు చికిత్స ప్రారంభించారు.

క్లినిక్ అండ్ రీసెర్చ్ ఇన్ హెపటాలజీ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ జర్నల్‌ ప్రచురించిన నివేదిక ప్రకారం.. శీతల పానీయాలు ఎక్కువగా తాగితే న్యుమాటోసిస్ సమస్య వస్తుందట.. తద్వారా.. కడుపులో అధిక మోతాదులో గ్యాస్‌ ఉత్పత్తి అవుతుంది. ఇతని విషయంలో కూడా అదే జరిగింది. చికిత్స సమయంలో ఆ యువకుడి ఛాతీకి ఆక్సిజన్ సరఫరా తగ్గడంతో హెపాటిక్ ఇస్కీమియాకు గురయ్యాడు. అంటే లివర్ షాక్. ఫలితంగా మృతి చెందాడని వైద్యులు తెలిపారు. అయితే గ్యాస్ నుండి ఉపశమనం పొందటానికి వైద్యులు ప్రయత్నించినప్పటికీ 18 గంటల చికిత్స తర్వాత మరణించాడని నివేదికలో వెల్లడించారు.

చాలామంది గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కూల్ డ్రింక్స్ హే తాగుంటారు. రిలీఫ్ అవుతంది అని.. చిన్నపాటి గ్యాస్ ఇబ్బింది అయితే పర్వాలేదు.. సీరియస్ గా ఉన్నప్పుడు ఇలా కూల్ డ్రింక్స్ ప్రిఫర్ చేయటం ఆరోగ్యానికి హానికరమే. ఈ యువకుడి విషయంలో అదే జరిగింది ఒకేసారి 1.5లీటర్ల కూల్ డ్రింక్ తాగటం వలనే అనవసరమైన సైడ్ ఎఫెక్ట్ వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. ఎండవేడిని తట్టుకోవాలంటే.. ఏ నిమ్మరసమో, మజ్జిగో తాగాలి కానీ ఇంతింత కూల్ డ్రింక్ ఒకేసారి తాగే పిచ్చిపనులు మీరు ఎప్పుడు చేయకండి.. సాధారణంగానే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగటం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతుంటారు. దానివల్ల డయాబెటీస్ బారిన పడే అవకాశం కూడా లేకపోలేదు. కానీ మనకు అన్నీ తెలిసే శీతలపానియాలు తాగుతుంటాం. ముఖ్యంగా కోకోకోలా, థంమ్స్ అప్ అయితే మరీ డెంజర్ అట. మీలో ఎవరికైనా ఇవి ఎక్కువగా తాగే అలవాటు ఉంటే.. కాస్త తగ్గించుకోవటానికి ప్రయత్నించండి.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news