దేవుడా..వీళ్ళ కక్కుర్తి తగలేయ్యా..పెళ్లిని కూడా వదిలేసి..

-

నచ్చిన ఫుడ్ ను తినాలని అనుకుంటారు. అందుకోసం ఎక్కడికైనా వెళతారు.. అంతే కాదు ఎంతైనా ఖర్చు చేస్తారు..కానీ కొన్ని ముఖ్యమైన కార్యాలను వదిలి మరీ రారు.ఇప్పుడు చెప్పుకొనె జంట ఒకటి కొద్ది క్షణాల్లో పెళ్ళి పెట్టుకొని తినడానికి మండపం దిగి వచ్చారు..ఇదేం తిండి గోల అనుకుంటున్నారా..అవును అండీ ఈ ఘటన నిజంగానే వెలుగు చూసింది..అసలు విషయం ఏంటో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం…

సోషల్ మీడియా ప్రపంచంలో వివాహ వేడుకలకు సంబంధించిన పలు రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఫన్నిగా ఉంటే , మరి కొన్ని మాత్రం జనాలను ఆశ్చర్యానికి గురైయ్యెలా చేస్తున్నాయి.తాజాగా ఓ నూతన జంటకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వేదిక మీద ఉన్న వధూవరులు ఇష్టమైన పానీపూరిని చూసి కింద దిగివచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ గుటకలేసుకుంటూ తిన్నారు. సాధారణంగా భారతదేశంలోని ప్రజలు స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. వాటిలో గోల్గప్ప (పానీపూరి) ఒకటి.. దీనిని స్నాక్స్‌గా తీసుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ‘గోల్గప్పా లవర్స్’ కు సంబంధించిన వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూస్తే మీ నోటిలో కూడా నీళ్లూరుతాయి.

వైరల్ అవుతున్న వీడియోలో.. గోల్గప్ప కోసం వధూవరులు వేదిక దిగి వచ్చారు. ఆ తర్వాత ఇద్దరూ పానీపూరి తీసుకోని ఛీర్స్ చెప్పుకుంటూ తింటారు. అయితే కొత్త జంటను చూసి నెటిజన్లు అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజంగా గోల్గప్ప లవర్స్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు..ఈ పోటీలో వధువు కాస్త ఎక్కువగా తిని వరుడును ఓడించింది..ఈ వీడియోను నెటిజన్లు మళ్లీ మళ్లీ చూస్తూ పలు కామెంట్లు చేస్తున్నారు. జంట ముచ్చటగా ఉందని రకరకాల ఫన్నిగా కామెంట్లను అందుకుంటుంది..ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా ఓ లుక్ వేసుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news