బంగీ జంప్: బంధం నుంచి విడిపోవడం అనేది ఈ మధ్య చాలా మంది బాధను కంటే.. ఆనందాన్ని ఇస్తుంది. ప్రీ వెడ్డింగ్ షూట్‌లా.. విడాకుల షూట్, బ్రేకప్ షూట్ కూడా చేసుకుంటున్నారు. సరే ఇదంతా పక్కనపెడితే.. ఒక అతను అయితే.. విడాకుల తీసుకున్న ఆనందంలో..తనకు ఇష్టమైన పనులన్నీ చేయాలనుకున్నాడు. కానీ ప్లాన్ బెడిసి కొట్టింది. బంగీ జప్ చేయబోతే.. పాపం తాడు తెగి.. మెడ విరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
బ్రెజిల్‌కు చెందిన రాఫెల్ డోస్ శాంటోస్ తోస్టా (22) అనే వ్యక్తి కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. విడాకులు తీసుకున్న ఆనందంలో తనకు నచ్చిన పనులన్నీ చేయాలనీ ప్లాన్ వేసుకున్నాడు. అందులో భాగంగానే బంగీ జంప్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దానికోసం బ్రెజిల్‌లోని కాంపో మాగ్రోలో బ్రిడ్జ్ స్వింగ్‌లో పాల్గొనడానికి వెళ్లాడు. ఆనందంగా 70 అడుగుల ఎత్తు నుంచి జంప్ చేయాలని వెళ్లి తాడు సాయంతో కిందకు దూకాడు. అంతలోనే తాడు తెగిపోవడంతో రాఫెల్ కిందనున్న నీటి కొలనులోకి పడిపోయాడు. అంత ఎత్తు నుంచి కిందకు పడటంతో మెడ విరిగింది. శరీరమంతా తీవ్ర గాయాలయ్యాయి. మొత్తానికైతే ప్రాణాలతో మాత్రం బయటపడ్డాడు. వాస్తవానికి ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలోనే జరగ్గా.. తాజాగా అతడు కోలుకోవడంతో ఇప్పుడు వైరల్ అవుతోంది.
కోలుకున్న తర్వాత అతను ఏమన్నాడో అతని మాటల్లోనే..
‘విడాకులు తీసుకున్న అనంతరం నేను బంగీ జంప్ చేయాలనుకున్నా. కానీ ఇలా అవుతుందని అసలు ఊహించలేదు. ఆ రోజు కళ్లు తెరిచే సమయానికి నీటిలో ఉన్నాను. చుట్టూ ఉన్న వారు ‘కదలకు అలాగే ఉండు, నీకు సాయం చేసేందుకు వస్తున్నారు’ అన్నారు. అసలేం జరిగిందో నాకు అర్థం కాలేదు. చాలా భయం వేసింది. చివరకు ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాను అన్నాడు.