చైనాలో నిమ్మకాయలకు భారీగా పెరిగిన డిమాండ్.. కారణం ఏంటో..?

-

చైనాలో పరిస్థితులు మారుతుంటే మనకు భయం వేస్తుంది.. కరోనా పుట్టినిల్లు చైనా.. మళ్లీ ఇప్పుడు అక్కడ వైరస్‌ విజృంభిస్తుంది. చైనాలో ఒక్కసారిగా నిమ్మకాయలకు భారీగా డిమాండ్‌ పెరిగింది. అవి ఎక్కడ కనిపించినా.. హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ప్రజలు గుంపులుగా వచ్చి.. భారీగా కొనుక్కొని పట్టుకుపోతున్నారు. నిమ్మరైతులు పండగ చేసుకుంటున్నారు. అసలు నిమ్మకాయలకు ఎందుకు అంత డిమాండ్‌ పెరిగింది..? కారణం ఏంటి..?
చైనాలో నిమ్మకాయల ధరలు డబుల్ అయ్యాయి. అసలు కొందామన్నా దొరకని పరిస్థితి ఉంది. దీనంతటికీ కారణం కరోనానే. చైనా ప్రభుత్వం తెచ్చిన రెండు వ్యాక్సిన్లు ప్రజలకు ఏమాత్రం పనిచెయ్యలేదు. కరోనా అస్సలు తగ్గలేదు. మళ్లీ కేసులు భారీగా పెరుగుతూ.. మరణాలు పెద్ద సంఖ్యలో నమోదవుతుంటే.. ప్రజల్లో భయం పెరిగిపోతోంది.
వ్యాక్సిన్ల కంటే నిమ్మకాయలు బెటర్ అనుకుంటున్న ప్రజలు వాటినే కొనుక్కుంటున్నారు. సిచువాన్‌లోని అనియూ కౌంటీలో.. 130 ఎకరాల్లో ఓ రైతు నిమ్మకాయలను సాగు చేస్తున్నాడు. ఇప్పుడు వాటికి విపరీతమైన డిమాండ్ ఉందని అతను తెలిపాడు. చైనాలోని మొత్తం నిమ్మకాయల్లో 70 శాతం సిచువాన్ నుంచే వస్తాయి. అనియూలో రైతు రోజూ 20 నుంచి 30 టన్నుల నిమ్మకాయలను అమ్ముకుంటున్నాడు. ఇలా వారం నుంచి వ్యాపారం పెరిగిందనీ.. అంతకు ముందు రోజూ ఐదారు టన్నులు మాత్రమే అమ్ముడయ్యేవని ఆ రైతు అంటున్నాడు…
చైనా ప్రజలు తెలివైన వాళ్లు. అందుకే నిమ్మకాయలు కొంటున్నారు. నిమ్మకాయల్లో సీ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. దాన్నే సిట్రస్ అంటారు. దీన్ని దాదాపు అమృతంగా భావిస్తున్నారు. ఇన్ఫెక్షన్లు, వ్యాధులు, వైరస్‌లతో పోరాడే శక్తి సిట్రస్‌కి ఉంటుంది. వ్యాక్సిన్లతో లాభం లేదని.. సహజమైన పద్ధతుల్లోనైనా కరోనాను ఎదుర్కోవాలని చైనా ప్రజలు భావిస్తున్నారు.
నిమ్మరసం, పసుపు, అల్లం, వెల్లుల్లి, పుదీనా, మిరియాల వంటివి సహజ పద్ధతిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఫిక్స్‌ అయ్యారు..కరోనా వచ్చిన కొత్తలో మనం కూడా ఇలాంటివి పాటించాం. కానీ చైనాలో వ్యాక్సిన్లు ఉన్నా.. అవి పనిచేయకపోవడంతో నిమ్మకాయలపై ఆధారపడుతున్నారు అక్కడి ప్రజలు.
చైనాలో ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ ఉంది. అది అక్కడి వ్యాక్సిన్లను ఎదుర్కొంటోంది. మన దేశంలో కూడా సెకండ్‌వేవ్‌లో ఒమిక్రాన్ భయపెట్టింది. కానీ అది త్వరగానే పోయింది. మన దేశంలోని వ్యాక్సిన్లు కరోనాపై బాగా పనిచేశాయి. ఇక్కడి ఎండ వాతావరణం కూడా కరోనా వైరస్ ఎక్కువగా పెరగకుండా ఉండేందుకు వీలుగా ఉంది. చైనాలో చల్లదనం ఎక్కువ కాబట్టి.. అక్కడి గాలిలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news