మీకు తెలుసా..ఈ 5 సందర్భాల్లో అస్సలు స్నానం చేయకూడదని..ముఖ్యంగా పడుకునే ముందు చేయొద్దట

-

స్నానం చేయటానికి కూడా ఒక నిర్థిష్ట సమయం ఉంటుంది మీకు తెలుసా..మనమంతా మనకు కుదిరినప్పుడు, మనం ఇష్టం వచ్చినట్లు స్నానం చేస్తుంటాం. చాలామంది ఉదయం లేచినప్పుడే స్నానం చేస్తుంటారు. అలా చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటాం అని ఫీలింగ్. ఇది మంచిదే..మరికొందరు తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు. కానీ అలా చేయకూడదట. లక్నోలోని కేర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ MD ఫిజీషియన్ డాక్టర్ సీమా యాదవ్‌ ముఖ్యంగా ఈ 5 సందర్భాల్లో అసలు స్నానం చేయకూడదని తన అధ్యయనంలో తేలినట్లు చెప్పారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. పడుకునే సమయానికి ముందు స్నానం చేయకూడదు

నిద్రపోయే ముందు స్నానం చేస్తే, అది మీ ఆరోగ్యాన్ని మరింత క్షీణించేలా చేస్తుంది. ఇదేంటి హాయిగా నిద్రపట్టాలని మనమంతా కరెక్టుగా నిద్రపోయే ముందేకదా స్నానం చేస్తాం అనుకుంటున్నారా.. రాత్రి నిద్రపోయే ముందు శరీర ఉష్ణోగ్రత పడిపోతుందట అందుకే అలా చేయకూడదని అంటున్నారు. కాబట్టి రాత్రి స్నానం చేస్తే, పడుకునే సమయానికి రెండు గంటల ముందే కానిచ్చేయాలట.

2. వ్యాయామం చేసిన వెంటనే కూడా స్నానం వద్దు

చాలా మంది వర్కవుట్ అయ్యాక వెంటనే స్నానం చేస్తారు. ఆ చెమట వాసన పోవాలని, తడిగా ఉన్న శరీరం ఫ్రెష్ గా ఉండేందుకు చేస్తుంటారు. కానీ ఈ పద్ధతి సరికాదు. మీరు వ్యాయామం చేసిన తర్వాత శరీరానికి కొంత సమయం ఇవ్వాలి, గుండె కొట్టుకోవడం సాధారణమైనప్పుడు మరియు చెమటలు ఆగిపోయినప్పుడు అంటే అరగంట తర్వాత మాత్రమే స్నానం చేయాలి. వ్యాయామం చేసిన వెంటనే తలస్నానం చేయడం వల్ల మెదడుకు వెళ్లే రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ పద్దతి కూడా మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

3. సూర్యాస్తమయం తర్వాత స్నానానికి దూరంగా ఉండండి

చాలా మంది రాత్రిపూట స్నానం చేస్తారు, కానీ రాత్రిపూట స్నానం చేయడం ఆరోగ్యానికి అంత మంచిదికాదట. ముఖ్యంగా ఈ సీజన్‌లో రాత్రిపూట స్నానానికి దూరంగా ఉండాలి. మీ షెడ్యూల్ ప్రకారం రాత్రిపూట స్నానం చేయవలసి వస్తే 5 నుండి 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం స్నానం చేయకూడదు. మరోవైపు, కొందరు వ్యక్తులు ఒకటి కంటే ఎక్కువసార్లు స్నానం చేయడానికి ఇష్టపడతారు, కానీ ఈ అలవాటు మీ ఆరోగ్యానికి అంత మంచిదికాదు. మీరు తాజాగా ఉండాలనుకుంటే మీరు సాధారణ నీటితో శరీరాన్ని స్పాంజ్ చేయవచ్చు. ఇదేంట్రా కొత్తగా చెబుతున్నారు. రోజుకు ఎన్నిసార్లు స్నానం చేస్తే అంతమంచిదంటారుగా అనుకుంటున్నారా..కానీ రాత్రిస్నానం మంచిదికాదట.

4. బయటి నుండి వచ్చిన వెంటనే స్నానం చేయకూడదు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బయటకు వెళ్లివచ్చిన వెంటనే చాలామంది తిన్నాగా బాత్రూమ్ లోకే వెళ్లి స్నానం చేస్తున్నారు. కానీ బయటి నుండి వచ్చిన వెంటనే స్నానం చేయకుండా ఉండాలి, దీని కారణంగా మీరు జ్వరం వస్తుందట. బయట దుమ్ము, చెమటతో ఇబ్బంది పడే వ్యక్తి ఇంటికి వచ్చి వెంటనే స్నానం చేసి ఫ్రెష్‌గా ఉండాలని కోరుకుంటాడు, అయితే బయటి నుండి వచ్చిన వెంటనే స్నానం చేయడం శరీరానికి అంతమంచిది కాదట..ఎందుకంటే.. స్నానం చేసినప్పుడు, మీ శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది. బయటి నుండి వచ్చే వ్యక్తి యొక్క శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, కాబట్టి తరచూ ఈ రెండు వేర్వేరు టెంప్రేచర్లు ఒకేసారి ఏర్పడటం ఆరోగ్యానికి మంచిది కాదట. కాబట్టి బయటినుంచ వచ్చిన కాసేపటికి మన శరీరం సాధారణ స్థితికి వచ్చాక స్నానం చేయటం మంచిదంటుననారు. అయితే ఈ కరోనా డేస్ లో ఇలా చేయటం కొంచెం జరిగే పనికాదు..బయటనుంచి ఇంట్లోకి రాగానే ఫస్ట్ శానిటైజ్ చేసుకుని..ఆ తర్వాత కొద్దిసేపటికి స్నానం చేయటానికి ట్రై చేయండి.

5. లో బీపి ఉన్నప్పుడు కూడా స్నానం చేయకూడదు.

 బీపీ తక్కువగా ఉన్న సమయంలో స్నానం చేయడం మానుకోవాలి. ఈ సీజన్‌లో మనం ఎక్కువ వేడి నీటితో స్నానం చేస్తుంటాం, వేడి నీటి ద్వారా పోర్స్ తెరుచుకుంటాయి. మీ రక్తపోటు తక్కువగా ఉంటే, అప్పుడు రక్త సరఫరాలో తేడా ఉంటుంది. మొదట రక్తపోటు సాధరణ స్థితికి వచ్చాక ఆపై స్నానానికి వెళ్లటం మంచిది.
పసిపిల్లలు అయితే..మధ్యాహ్న సమయంలో స్నానం చేయించటం మంచిదట. ఎందుకంటే మధ్యాహ్నం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది.ఆ టైంలో చేయిస్తే శరీర ఉష్ణోగ్రతకు, బయట టెంప్రేచర్ కు సమానంగా ఉండి..పిల్లలకు అనారోగ్యసమస్యలు రావట. ఒకవేళ పిల్లలకు జ్వరం ఉన్నట్లైతే స్నానం చేయించటం అంత మంచిదికాదు. ఆ సమయంలో స్నానం చేయిస్తే ఆరోగ్యం ఇంకా దెబ్బతినే ప్రమాదం ఉంది. అసలు పసిపిల్లలకు చలికాలంలో రోజు స్నానం చేయించాల్సిన అవసరం లేదట. ఈ ‌విషయం ఇప్పటికే చాలామంది నిపుణులు చెబుతున్నారు. మెత్తని క్లాత్ తీసుకుని శిశువు మెడ, నాపీభాగం, చంకలు శుభ్రం చేస్తే సరిపోతుందట.

 స్నానం చేయటానికి వేడి నీరు మంచిదా, చల్లటి నీరు మంచిదా?

వేడి, చల్లని నీరు రెండూ ఆరోగ్యానికి హానికరం.మరి ఇంకేనీటితో చెయ్యాలి అనుకుంటున్నారా.. బాగా చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. తద్వారా జ్వరం లేదా జలుబు రావొచ్చు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల జుట్టుపై చెడు ప్రభావం ఉంటుంది, బాగా వేడి నీటితో స్నానం చేయడం వల్ల జుట్టు రాలే సమస్య వస్తుంది, కాబట్టి సాధారణ నీటిని మాత్రమే ఉపయోగించాలి.
మీకు కానీ ఈ ఐదు సందర్భాల్లో స్నానం చేసే అలవాటు ఉంటే..వెంటనే తగ్గించుకోవటం మంచిదని వైద్యనిపుణలు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news