లైట్ వేసుకుంటే కరెంట్ షాకే… ఇది నరకాసుర పాలనే : నారా లోకేష్

-

వైసీపీ సర్కార్ పై మరోసారి ఫైర్‌ అయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. దీపం వెలిగించుకుందామంటే నూనె ధర మండుతోందని… లైట్లు వేసుకుందామంటే కరెంటు చార్జీలు షాక్ కొట్టేస్తున్నాయంటూ వైసీపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు. ఏపీలో దీపావళి నాడు ప్రజల పరిస్థితి ఇలా ఉందని…. నరకాసుర పాలన ఇలాగే ఉండేదేమో అంటూ ఎద్దేవా చేశారు.

మున్ముందు మంచి రోజులు రావాలని ఆశిద్దామని… ఇంటిల్లి పాదికీ ఆనందాలు పంచే దీపాల పండుగ వేళ, సర్వశుభాలు కలగాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు నారా లోకేష్‌. ఇక అంతకు మందు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజ‌లైనా, ప్రతి ప‌క్షమైనా, చివ‌రికి అన్నదాత‌లనైనా ప్రశ్నిస్తే.. ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా అణిచివేస్తోందని ఫైర్‌ అయ్యారు.

విజయనగరం జిల్లాలో చెరకు రైతులపై ప్రభుత్వం దాడి చేయించడం దారుణమన్నారు. ఎన్‌సీఎస్‌ షుగర్స్ యాజ‌మాన్యం రెండు క్రషింగ్ సీజన్లకు రూ.16.33 కోట్లు బ‌కాయిలు త‌క్షణ‌మే చెల్లించాల‌ని ధర్నాకు దిగిన చెరకు రైతులపై దౌర్జన్యం సరికాదని తెలిపారు. మ‌హిళ‌ల ప‌ట్ల అస‌భ్యంగా ప్రవ‌ర్తించ‌డం.. స‌భ్యస‌మాజం త‌ల‌దించుకునే విధంగా ఉందని.. త‌మ‌కు న్యాయంగా రావాల్సిన బ‌కాయిలు అడిగితే దాష్టీకానికి పాల్పడ‌టం చాలా అన్యాయమని ఫైర్‌ అయ్యారు. త‌క్షణ‌మే చెర‌కు రైతుల బ‌కాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news