వీఎల్‌సీ ప్లేయర్‌ను బ్యాన్ చేసిన ప్రభుత్వం.. కారణం అదేనా..?

-

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ సర్వర్‌ VLC మీడియా ప్లేయర్‌ గురించి తెలియని వారెవరూ ఉండరూ.. కానీ ఇక పై ఈ పేరు వినిపించదు. మన దేశంలో దీన్ని నిషేధించారు. భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో దాదాపు 350 చైనీస్ యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది. ఇటీవల, యుద్దభూమి మొబైల్ ఇండియా (BGMI) కూడా Google Play Store, Apple యొక్క యాప్ నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైంది.
వీడియోలాన్ ప్రాజెక్ట్ VLC మీడియా ప్లేయర్, వెబ్‌సైట్‌ను ప్రభుత్వం IT చట్టం, 2000 ప్రకారం నిషేధించింది. VLC మీడియా ప్లేయర్, దాని వెబ్‌సైట్ సేవలు ఇప్పటికే రెండు నెలలుగా నిలిపేశారు. ఈ విషయంలో ఇప్పటి వరకు కంపెనీ నుంచి, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. VLC మీడియా వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయగానే IT చట్టం కింద నిషేధించినట్లు సందేశం వస్తుంది.
VLC మీడియా ప్లేయర్‌ను డౌన్‌లోడ్ చేసుకునే లింక్‌లపైనా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో ఈ ప్లేయర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం కూడా ఇకపైసాధ్యం కాదు. చైనాకు చెందిన హ్యాకింగ్ గ్రూప్ Cicada సైబర్ అటాక్స్ జరిపేందుకు VLC మీడియా ప్లేయర్‌ను టార్గెట్ చేసిందని, ఈమేరకు ప్రభుత్వం VLC ప్లేయర్‌ను బ్యాన్ చేసినట్లు నిపుణులు భావిస్తున్నారు.
భద్రతా కారణాల వల్ల భారతదేశంలో సుమారు 350 చైనీస్ యాప్‌లను ఇప్పటికే ప్రభుత్వం నిషేధించింది. ఇటీవల, యుద్దభూమి మొబైల్ ఇండియా (BGMI) కూడా Google Play Store, Apple యొక్క యాప్ నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైంది. దీని తర్వాత, స్టోర్ నుంచి BGMI కనిపించకుండా పోవడంతో గేమ్ ప్లేయర్‌లకు దిమ్మతిరినట్లైంది. BGMI హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. BGMI నిషేధాన్ని తర్వాత ఒక వార్తా సంస్థ ధృవీకరించింది. 2020లో PUBGని నిషేధించిన తర్వాత PUBG కొత్త అవతార్‌గా BGMI ప్రారంభించిన సంగతి తెలిసిందే.
భద్రతా కారణాల దృష్ట్యా యాప్‌ను బాన్‌ చేసేస్తున్నారు. ఆ యాప్స్‌కు ఇండియాలో బ్రాంచ్‌లు ఉంటున్నాయి. అందులో మన వాళ్లు పనిచేస్తున్నారు. ఉన్నట్టుండి ఇలా బ్యాన్‌ చేయడం వల్ల ఎంతో మంది ఉద్యోగులుతీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ‘హలో’ యాప్‌ను బ్యాన్‌ చేసినప్పుడు ఇదే జరిగింది. ప్రభుత్వాలు బ్యాన్‌ చేయడమే కాకుండా ఇంకా ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచిస్తే బాగుండే అనే అభిప్రాయం ఎంతోమందిలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news