ఫేస్‌బుక్‌లో ప్రేమ..ఇండియన్‌ అబ్బాయిని చేసుకున్న స్వీడన్‌ అమ్మాయి..!!

-

ప్రేమకు వయసుతో, హద్దులతో సంబంధం లేదు.. హద్దులేనిదే నిజమైన ప్రేమ.. ప్యూర్‌ లవ్‌ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే.. కానీ ఈరోజుల్లో అంత స్వచ్ఛమైన ప్రేమ దొరకడమే కష్టంగా ఉంది.. ప్రేమ పేరుతో జరిగితే మోసాలే ఎక్కువ.. ఇలాంటి పరిస్థితుల్లో.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తిని ప్రేమించి.. అతడిని పెళ్లి చేసుకోవడానికి..ఖండాలు దాటి మరీ వచ్చింది ఓ యువతి.. ఆమె ధైర్యం గొప్పదే.. స్వీడన్‌ అమ్మాయి, ఇండియా అబ్బాయి ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమించుకుని.. పెళ్లిద్వారా ఒక్కటయ్యారు..! ఈ లవ్‌స్టోరీ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది..!!
స్వీడన్‌కు చెందిన ఓ మహిళ ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి భారత్‌కు వచ్చింది.. క్రిస్టెన్ లీబర్ట్ అనే మహిళ శుక్రవారం హిందూ ఆచారాల ప్రకారం.. ఒక పాఠశాలలో పవన్ కుమార్‌ను వివాహం చేసుకుంది. పవన్ ఉత్తరప్రదేశ్‌లోని ఎటా నివాసి. ప్రేమ వివాహం చేసుకోవడానికి దాదాపు 6,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన క్రిస్టెన్. ఫేస్‌బుక్‌లో పవన్‌ను కలిసిందీ ఈ యువతి…ఈ జంట పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.. . నివేదికల ప్రకారం.. క్రిస్టెన్ మరియు పవన్ 2012లో ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యారు.. అప్పటి నుంచి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పవన్ బి. టెక్ గ్రాడ్యుయేట్ చేసి.. ఒక సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.
దాదాపు 11 ఏళ్ల ప్రేమ అనంతరం వీరిద్దరు పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు.. అయితే.. క్రెస్టినా ఇంతకు ముందు కూడా.. ఇండియాకు వచ్చిందట.. తనకు భారతదేశం అంటే చాలా ఇష్టమట.. ఇండియా అబ్బాయిని పెళ్లిచేసుకోవడం ఆనందంగా ఉందని.. క్రిస్టినా అంటున్నారు.
వీరిద్దరి లవ్‌ స్టోరీ చూసి.. నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.. ఇలాంటి ప్రేమికులు ఈరోజుల్లో చాలా అరుదుగా ఉంటున్నారు.. ప్రేమ అంటే.. ఇప్పుడున్న పరస్థితుల్లో.. సంవత్సరం రెండు సంవత్సరాలకు మించి ఉంటుంది.. ఐదేళ్ల లవ్‌స్టోరీలు కూడా..పెళ్లివరకూ వెళ్లడం లేదు.. కొన్ని కథలకు కుటుంబాలకు అడ్డుపడుతుంటే.. కొన్ని కథలకు ప్రేమికులే విలన్లు అవుతున్నారు.. పోనూ పోనూ వారి ప్రవర్తన నచ్చకో, కేరీర్‌ బాగుండదనో.. బ్రేకప్‌ చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news