డబ్బుని ఎలా పొదుపు చేయాలో మీ పిల్లలకు ఇలా నేర్పించండి

ఈ ప్రపంచాన్ని శాసించేది డబ్బే. ప్రపంచమంతా డబ్బు చుట్టే తిరుగుతుంది. అందుకే డబ్బుని పొదుపు చేయడం తెలుసుకోవాలి. ఎంత సంపాదిస్తున్నావన్న దాని కంటే ఎంత పొదుపు చేస్తున్నావన్నదే ముఖ్యం. అలా అని కనీస అవసరాలకు, ఆనందాలకు కూడా డబ్బు ఖర్చు చేయకపోతే లోభిగా మారతారు. అదలా ఉంచితే, ప్రస్తుతం మీ పిల్లలు డబ్బు పొదుపు చేయడానికి పెద్దలు చేయాల్సిన పనులేమిటో ఇక్కడ చూద్దాం.

 

childrens

అర్థం చేయండి

పిల్లలకు డబ్బు విలువ అర్థం చేయించాలి. పొదుపుకి ఖర్చుకి తేడా తెలియాలి. అవసరాలకు, కోరికలకు తేడా తెలపాలి. అప్పుడే దేనికోసం డబ్బు ఖర్చు చేయాలనేది అర్థం అవుతుంది.

పాకెట్ మనీ

మీ పిల్లలకు 5సంవత్సరాల వయసు దాటిందంటే వారికి పాకెట్ మన ఇవ్వాలి. దానివల్ల వారి దగ్గరున్న డబ్బుని ఏ విధంగా క్రమశిక్షణతో ఖర్చు చేయవచ్చో తెలుసుకుంటారు. అందుకే పాకెట్ మనీ నెలకి ఒకసారి మాత్రమే ఇవ్వండి. ఆ నెలంతా డబ్బును మేనేజ్ చేయడం వారు తెలుసుకోవాలి.

పిగ్గీ బ్యాంక్

మీ పిల్లలకి ఇచ్చిన పాకెట్ మనీలో నుండి కొంత డబ్బుని పిగ్గీ బ్యాంకులో వేసేలా అలవాటు చేయండి. అది పిల్లలపై చాలా ప్రభావితం చేస్తుంది.

డబ్బుతో ఆటలు

మనీ గేమ్స్ ఆడండి. ఎలా బడ్జెట్ వేసుకోవాలి? ఎలా వేస్తే ఎంత మిగులుతుంది? ఎంత ఎక్కువ మిగిలించాలి మొదలుకుని వారానికి ఒకసారి మనీ గేమ్స్ ఆడండి.

షాపింగ్

చిన్న చిన్న వస్తువులు కొనడానికి వారిని షాపింగ్ కి పంపండి. బేరం ఆడడం అబ్బేలా కృషి చేయండి. వారంలో ఒకరోజు కూరగాయలు వారినే తెమ్మనండి. అది వారిలో పబ్లిక్ స్పీకింగ్ పెంచడంతో పాటు బేరమాడే కళను పెంచుతుంది.

ఉదాహరనగా నిలవండి

పిల్లలు పెద్దలను అనుకరించడానికి ఇష్టపడతారు. కాబట్టి డబ్బు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.