మలేషియా రైతులు పండించిన జపనీస్ మస్క్ మిలన్.. ఒక్కోటి 3వేలకి పైగానే..

-

వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఆహారాలలో మస్క్ మిలన్ కూడా ఒకటి. శివరాత్రి రోజున అందరూ తినే ఈ పండు ఖరీదు మలేషియాలో 3వేలకి పైగానే ఉందంటే నమ్మగలారా? అవును.. మీరు చదువుతున్నది నిజమే. మలేషియా రైతులు పండిస్తున్న జపనీస్ మస్క్ మిలన్ ధర ఒక్కోటి 3వేలకి పైగానే ఉంది. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఒక పండుకి అంత ధర వస్తుందంటే దానికంత ప్రత్యేకత ఏముందని ఆలోచిస్తున్నారా? ఆగండాగండి. అవి నీళ్ళకి కాదు మసాజ్, మ్యూజిక్ కి పెరుగుతున్నాయి కాబట్టి.

మస్క్ మిలన్న్ కి మసాజ్ చేస్తూ, తోటలో మ్యూజిక్ పెట్టి పంట పండిస్తున్నారు మలేషియన్ రైతులు. దీనివల్ల మస్క్ మిలన్ మంచి రుచిగా మారడంతో పాటు మ్యూజిక్ కారణంగా స్పష్టమైన గుండ్రటి ఆకారంలోకి వచ్చి పెద్దగా పెరుగుతుందట. ఇలా మసాజ్ చేసే పద్దతిని టామా ఫుకీ అంటున్నారు. పొలంలో క్లాసికల్ మ్యూజిక్ పెట్టి ఒక్కో మస్క్ మిలన్ కి మసాజ్ చేస్తూ ఉంటే అవి అందంగా పెరుగుతున్నాయట. అందుకే వీటిని కొనడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.

మోనో కంపెనీకి చెందిన షెన్ జెంగ్ చెప్పిన ప్రకారం జపనీస్ మస్క్ మిలన్ ని పండించడం ఒక కళ. ఒక్కో మస్క్ మిలన్ కళా వస్తువుగా కనిపిస్తుంది. అందుకే ఈ పండుని కొనడానికి అంత డిమాండ్ ఏర్పడిందని చెబుతున్నారు. ఇలా పండించిన మస్క్ మిలన్లు ప్రత్యేకమైన పండ్ల దుకాణాలలో మాత్రమే దొరుకుతాయి. ఒక్కోసారి ఒక్కో పండు ధర 3వేలకి పైగానే ఉంటుంది. అప్పుడెప్పుడో జపాన్ రైతులు చేసిన పద్దతిని మలేషియా రైతులు ఫాలో అవుతున్నారు. గత ఏడాది ఒక్కో పండు ధర 168రింగిట్లుగా (3,035) గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news