గోవా బీచ్‌లో రయ్‌రయ్‌ మని కారు నడిపాడు.. సీన్‌ కట్‌ చేస్తే కేసు ఫైల్‌..!

-

మన ఏరియాలో కామన్‌ అనుకున్నవి వేరే ప్రాంతాల్లో వాటిపై కండీషన్స్‌ ఉంటాయి.. ఊర్లో ఉన్నట్లే..వేరే చోటుకు వెళ్లినప్పుడు కూడా ఉంటానంటే కుదరుదు.. మనం ఇంట్లో ఉన్నప్పుడు షార్ట్స్‌ వేసుకుంటాం.. బయటకు వెళ్లాలన్నా అలానే వెళ్లిపోతారు. కానీ కొన్ని సిటీస్‌లో షార్ట్స్‌ వేసుకుని అబ్బాయిలు బయటకు వస్తే ఒప్పుకోరు. అలానే ఓ వ్యక్తి..గోవా బీచ్‌కు వెళ్లి అత్యుస్సాహంతో బీచ్‌లో కారువేసుకుని తిరిగాడు.. అది కాస్తా అక్కడి పోలీసులకు తెలిసింది మనోడు మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి గోవాలోని అంజునా బీచ్‌లో ఇష్టమొచ్చినట్లు కారు నడిపాడు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. IPC సెక్షన్లు 279, 336 కింద FIR నమోదైంది. ఢిల్లీలోని మంగోల్పురికి చెందిన లలిత్ కుమార్ దయాల్ అనే వ్యక్తి ఈ తిక్క పని చేసింది. ఈయనగారు కారు నడుపుతూ ఇతర పర్యాటకులకు ఇబ్బంది కలిగించాడు. తెగ హడావిడి చేశాడు. చివరకు కారు బీచ్‌లోని ఇసుకలో కూరుకుపోయింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ట్విట్టర్‌లోని @goanewshub అకౌంట్‌లో జూన్ 16, 2022న పోస్ట్ చేశారు. దీన్ని గమనిస్తే… లలిత్… హ్యాందాయ్ క్రెటా SUV నడుపుతుంటాడు..కారు ఇసుకలో ఇరుక్కుపోయిన తర్వాత అందులోని వారు బయటకు వస్తూ… దాన్ని ఎలా అక్కడి నుంచి తప్పించాలో అర్థం కాక పాపం వాళ్లు తెగ ఇబ్బంది పడతారు.బీచ్‌లో ఇసుక ఉంటుంది. ఇసుకలో టైర్లు సరిగా వెళ్లవు అని తెలిసి కూడా ఆ టైంలో అత్యుస్సాహంతో అలా చేసేశారు. పోలీసులు కారును సీజ్ చేశారు.
ఇలాంటి ఘటనలు బీచ్‌ల్లో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. చెప్పినా సరే జనాలు వినకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిసారు. ఇదే నెలలో లఢక్‌లోనూ ఇలానే బీచ్‌లో కారు నడిపారు. టయోటా ఫార్చునర్‌ని నుబ్రా లోయలోని హుందర్‌ ఇసుకపై డ్రైవ్‌ చేశారు. పోలీసులు వారికి రూ. 50,000 జరిమానా విధించారు. మీరు ఇలాంటి ప్లేసులకు వెళ్తే కారు నడిపేలాంటి ప్రోగ్రామ్స్‌ పెట్టుకోకండి మరీ..!

Read more RELATED
Recommended to you

Latest news