వావ్..బైక్ పై రయ్యి రయ్యిమంటున్న నారా బ్రాహ్మణి..వీడియో..

నందమూరి బాలకృష్ణ కూతురు నారా లోకేశ్‌ భార్య నారా బ్రాహ్మణి… ఇది మాత్రమే తన ఐడెంటింటి కాదని నిరూపించుకుంటున్నారు. సినీ, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన బ్రాహ్మణి.. గురించి చాలా మందికి తెలియదు.ఆమె ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.. బిజినెస్ ఉమెన్ గా మాత్రమే కాదు..కొత్తగా ఆలోచించాలని అనుకుంటుంది.

ఓవైపు తల్లిగా తన బాధ్యతను నిర్వరిస్తూనే మరోవైపు హెరిటెజ్ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌గా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తనలోని మరో కోణాన్ని బయటపెట్టారు బ్రాహ్మణి.

నారా బ్రాహ్మణికి బైక్‌ రైడింగ్‌ అంటే ఇష్టం. ఆమె ఒక ప్రొఫెషినల్‌ బైక్‌ రైడింగ్‌ గ్రూపులో మెంబర్‌ కూడా. ఇటీవల..జావా యజ్ది స్పోర్ట్స్ బైక్ మీద లేహ్ – లడక్ లాంటి హిల్ స్టేషన్ ఏరియాలో ట్రావెల్ చేశారు. ఈ ట్రావెల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. స్పోర్ట్స్‌ బైక్‌ను అలవోకగా కొండల్లో నడపించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బ్రాహ్మణిలో ఇలాంటి టాలెంట్‌ కూడా ఉందా అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు..

మొన్నీమధ్య లడఖ్‌లోని లేహ్‌ ప్రాంతాన్ని సందర్శించిన నారా బ్రాహ్మణి అక్కడ అడ్వెంచరస్‌ బైక్‌ రైడ్‌లో పాల్గొన్నారు. కొండల నడుమ సాగే ఈ జర్నీలో పలువురు బైక్‌ రైడర్స్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన జర్మీకి సంబంధించిన వివరాలను వీడియో రూపంలో పంచుకున్నారు బ్రాహ్మణి. ఉదయంపూట లేహ్‌ నుంచి బైక్ రైడింగ్ చేస్తూ బయల్దేరి, థిక్సే మాంటెన్సరికీ చేరిన తర్వాత అక్కడే టిఫిన్, మెడిటేషన్ కూడా చేయాల్సి ఉంటుందని తెలిపారు. బ్రాహ్మణి జర్నీ, బైక్‌ రైడింగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.. బాలయ్య ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి.