బాలివుడ్ సాంగ్ కు అదరగొట్టిన నార్వేజియన్ డ్యాన్స్ గ్రూప్..వీడియో వైరల్..

-

స్మార్ట్ యుగం నడుస్తుంది..వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంటర్నెట్ ను సోషల్ మీడియాను విరివిగా వాడేస్తున్నారు.అంతేకాదు ఎన్నో రకాల వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అందులో డాన్స్ కు సంభందించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..తాజాగా మరో వీడియో ఒకటి చక్కర్లు కొడుతుంది.

కొరియన్ పాప్ మ్యూజిక్, సీ పాప్ , నార్వేజియన్ డ్యాన్స్ గ్రూప్ ఇలా అనేక మంది కళాకారులు తమ డ్యాన్స్ తో సంగీతంతో సంగీత ప్రియులను అలరిస్తున్నారు. నార్వేజియన్ డ్యాన్స్ గ్రూప్ ది క్విక్ స్టైల్ కూడా సోషల్ మీడియాలో మంచి పాపులర్ అయింది. అవును ఈ గ్రూప్ బాలీవుడ్ చిత్రం ‘బార్ బార్ దేఖో’లోని ‘కాలా చష్మా’ పాటకు డ్యాన్స్ చేసి.. ప్రపంచం మొత్తాన్ని అలరించింది..

తాజాగా మరో మరోసారి బాలీవుడ్ సాంగ్ కు డ్యాన్స్ చేసి అలరిస్తోంది. హీరో ఆయుష్మాన్ ఖురానా ఇటీవల విడుదల చేసిన ‘యాన్ యాక్షన్ హీరో’ చిత్రం నుండి ‘ జెడ నాషా ‘ సాంగ్ కు ఓ రేంజ్ లో డ్యాన్స్ చేసి నెటిజన్లల ప్రశంసలు అందుకుంటున్నారు.హిందీ సాంగ్స్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు..ఎప్పుడూ ఏదొక పాట నెట్టింట ట్రెండ్ అవుతుంది..ఇక ‘జెడ నషా’ పాటకు ఉన్న క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పాటపై రీల్స్‌ వెల్లువెత్తాయి. ఇప్పుడు నార్వే డ్యాన్స్ గ్రూప్ ఈ పాటపై రీల్ చేసింది.. ఈ రీల్ చాలా సంచలనం సృష్టిస్తోంది. వైరల్ అవుతున్న క్లిప్‌లో, బృందంలోని ప్రతి డ్యాన్సర్ తమ డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు..వారి డ్యాన్స్ ను చూసిన ప్రతి ఒక్కరూ వారెవ్వా అనకుండా ఉండరు..మీరు ఆ వీడియోను ఒకసారి చూడండి..

https://www.instagram.com/reel/CmT0SlXOd4m/?igshid=YmMyMTA2M2Y=

Read more RELATED
Recommended to you

Latest news