కార్యాలయం: ఆఫీసులో ఎక్కువ సార్లు.. మీకు మీ బాస్‌కు మధ్య లీవ్ పంచాయితీ అవుతుంది కదా.. మనకా బోలెడు పనులు.. వీళ్లు వీక్ ఆఫ్‌లు సరిపోవు.. మనకు ఉన్న సెలవులను వాడుకోవడం మన హక్కు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే.. అటు వర్క్‌ను ఇటు లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకోవడమేగా అని మనం మన సెలవులన్నీ ఒక్కటీ వేస్ట్ కాకుండా వాడుకుంటాం. కానీ అతను మాత్రం 27 ఏళ్ల ఉద్యోగంలో ఒక్క సెలవు కూడా పెట్టలేదట..! పదవీ విరమణ రోజు అతినికి కంపెనీ కొన్ని కోట్ల విరాళం ఇచ్చింది..! ఇంతకీ ఎవరా వ్యక్తి..? ఏంటా కంపెనీ అనుకుంటున్నారా..?
ఇతని పేరు కెవిన్ ఫోర్డ్. 54 సంవత్సరాల ఈ వ్యక్తి బర్గర్‌కింగ్ ఫుడ్ చైన్ రెస్టారెంట్‌లో గత 27ఏళ్లుగా పనిచేస్తున్నాడు. ఉద్యోగం చేయడం అంటే అవసరాల కోసమే, డబ్బు కోసమే కాదని క్రమశిక్షణతో చేసే ఓ బాధ్యత అని కెవిన్ ఫోర్డ్ నిరూపించాడు. కెవిన్ ఫోర్ట్ గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే తన 27ఏళ్ల ఉద్యోగ జీవితంలో ..ఒక్క రోజు కూడా పనికి వెళ్లకుండా ఉండలేదట. అంటే సెలవు పెట్టకుండా 27సంవత్సరాల పాటు పని చేసి పదవీ విరమణ చేశాడు. అసలు ఎవరైనా ఉంటారా.. ఈరోజుల్లో అలా..!
అమెరికాలోని లాస్‌వెగాస్‌కు చెందిన కెవిన్ ఫోర్ట్ బర్గర్‌కింగ్ చైన్ రెస్టారెంట్‌లో ఉద్యోగిగా 27సంవత్సరాల పాటు సెలవు తీసుకోకుండా పని చేసినట్లుగా కంపెనీ ప్రకటించింది.. 54 ఏళ్ల బర్గర్ కింగ్ ఉద్యోగి కెవిన్ ఫోర్డ్ ఉద్యోగం చేస్తున్నంత కాలంలో సంపాధించిన జీతం, బోనస్ సంగతి పక్కన పెడితే రిటైర్మెంట్ తర్వాత అతని సేవలు, శ్రమను గుర్తించి విరాళాల రూపంలో వస్తున్న డబ్బే ఎక్కువగా ఉంది
ఇంత సిన్సియర్‌గా ఉద్యోగం చేసిన కెవిన్ ఫోర్డ్‌కు రివార్డ్ ఇవ్వడానికి గోఫండ్‌మీ అనే క్యాంపెయిన్ ద్వారా $400,000 అమెరికన్ డాలర్లు..అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల్లో చెప్పాలంటే 3.26 కోట్ల రూపాయలు అందుకున్నాడు. వ్యక్తిగత జీవితం కోసం వృత్తిని నమ్ముకొని పని చేసినందుకు కెవిన్ ఫోర్డ్‌కు రిటైర్మెంట్ తర్వాత ఫలితం దక్కింది. 27ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా చేసినందుకు ప్రతిఫలం రిటైర్మెంట్ తర్వాత అందుకోవడం గర్వంగా ఉందని కెవిన్ అంటున్నాడు.
కోట్లు సంపాధించాలంటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాల్సిన పని లేదని ..కేవలం చేస్తున్న ఉద్యోగాన్ని సిన్సియర్‌గా చేస్తే గుర్తింపు, ఆదాయం దానంతటకి అదే వస్తుందని కెవిన్ ఫోర్ట్ నిరూపించాడు. ఇతనిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.