అంత పెద్ద రాయిని అలా ముట్టుకుంటే జరుగుతుంది..ఎలా?

-

మాములుగా పెద్ద బండ రాయిని కదిలించాలి అంటే మాత్రం చాలా మంది మనుషులు కావాలి. లేదంటే భారీ క్రెన్ సాయంతో పక్కకు తియ్యాలి..కానీ ముట్టుకుంటే పెద్ద రాయి పక్కకు జరగడం అదే అసాధ్యం..అని అనుకుంటే మీరు పప్పులో కాళ్ళు వేసినట్లే..132 టన్నుల బరువున్న ఈ రాయిని ఎంతో బలహీన వంతుడైన మనిషి కూడా సునాయాసంగా కదిలిస్తారు. మరి ఇంత ఆశ్చర్యం కలిగించే ఈ బండరాయి ఎక్కడ ఉంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఈశాన్య ఫ్రాన్స్ లోని హ్యూల్ గోట్ అడవి ప్రాంతంలో ఉన్న ఈ బరువైన బండరాయిని ట్రేబ్లింగ్ స్టోన్ అని పిలుస్తారు.ఈ రాయి మనిషి బరువు కన్నా వెయ్యి రెట్లు అధికంగా ఉన్నప్పటికీ ఎంతో బలహీన వంతులు కూడా ఎంతో సునాయాసంగా కదిలించాడు. అయితే ఈ రాయి కదలాలి అంటే సరైన దిశలో కదిలించినప్పుడు మాత్రమే కదులుతుంది. ఎంతో అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ రాయిని కదిలించగలరు. అయితే ఇంత బరువైన రాయి మరొక రాయి పై ఉండటం గమనార్హం. ఇలా ఈ రాయి ఉండటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..

ఈ వింత బండరాయిని చూడటం కోసం పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటారు. ఇక ఈ బండరాయిని ఒక వైపు నుంచి కదిలిస్తేనే ఊగుతూ కదులుతుంది.ఇలా ఈ రాయి ఒకే దిశలో మాత్రమే ఊగడానికి గల కారణం ఏమిటి దీని వెనుక ఎలాంటి రహస్యం ఉందనే విషయం ఇప్పటికీ అంతుచిక్కలేదు..రోజు రోజుకు అక్కడకు వచ్చే  ల్పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది.. మొత్తానికి ఈ రాయికి సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది…

Read more RELATED
Recommended to you

Latest news