కెమికల్‌ ఫ్రీ లిప్‌స్టిక్ కనిపెట్టిన శాస్త్రవేత్తలు..

-

లిప్‌స్టిక్‌ ఆడవారికి అందాన్ని ఇస్తుంది. చరిత్రలో ఎర్రటి రాళ్ళని పగలగొట్టి వాటిని లిప్ స్టిక్‌గా రాసుకునే వాళ్ళు. తర్వాత పరిశోధకులు వాటిని వృత్తాకారంగా అభివృద్ధి చేసి సహజ పదార్థాలు జోడించి అందుబాటులోకి తీసుకొచ్చారు. దాదాపు అందరూ ఆడవాళ్లు లిప్‌స్టిక్‌ వేసుకుంటారు.. అయితే ఇవి మంచివి కావు, రసాయనాలతో కూడినవి అంటారు. పైగా ఒకరు వాడిన లిప్ స్టిక్స్ ఇంకొకరు ఉపయోగించడం వల్ల అనారోగ్యాలు వ్యాపించే ప్రమాదం ఉంది. ఇదే కాకుండా లిప్ స్టిక్స్ లోని రసాయనాల వల్ల కూడా అనేక రోగాలు వస్తాయి. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్ లక్షణాలు కలిగిన కాన్ బెర్రీ కలర్ లిప్ స్టిక్ తీసుకొచ్చారు. ఇది వాడటం వల్ల లిప్ స్టిక్స్ వల్ల వచ్చే వైరస్లు, బ్యాక్టీరియాని అడ్డుకుంటుందట..

కాన్ బెర్రీ రసంతో వైరస్‌లకి చెక్

ఉదాహరణకి ఎరుపు రంగు కోసం రెడ్ డ్రాగన్ ఫ్రూట్‌ని లిప్‌స్టిక్‌లో ఉపయోగించే వాళ్ళు. అందులో యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. కాన్ బెర్రీ రసంలో వైరస్‌లు, బ్యాక్టీరియాని అడ్డుకునే గుణం కలిగి ఉందని పరిశోధకులు గుర్తించారు. యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్న ముదురు ఎరుపు రంగులో లిప్ స్టిక్‌ని స్పానిష్ బృందం రూపొందిస్తుంది. ఈ పరిశోధనా బృందం కాన్ బెర్రీ రసాన్ని లిప్ స్టిక్స్ క్రీమ్ బెస్‌లో మిక్స్ చేసింది. ఇందులో షియా బటర్, విటమిన్ ఇ, ప్రొవిటమిన్ బి 5, బాబాసు, అవకాడో ఆయిల్ను కలిపారు.
కాన్ బెర్రీ రసం జోడించడం వల్ల ఎన్వలప్డ్, నాన్ ఎన్వలప్డ్ వైరస్ రకాలు రెండు ఇన్ యాక్టివేట్ అయ్యాయి. ఇది వాడిన ఐదు గంటల వ్యవధిలోనే మైక్రోబ్యాక్టీరియాలు క్రియారహిత్యం అయ్యాయి. వీళ్ళు తయారు చేసిన లిప్ స్టిక్ ఫార్ములా వివిధ రకాల వ్యాధులని కలిగించే సూక్ష్మజీవుల నుంచి రక్షణ అందించగలదని పరశోధకులు తెలిపారు. స్పానిష్‌కి చెందిన పరిశోధకులు దీన్ని రూపొందించారు. ఇది అందుబాటులోకి వస్తే.. చాలా పెద్ద సమస్యే తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news