లండన్ లోని నార్విన్ నుంచి లివర్‌పూల్ స్ట్రీట్ మధ్య నడిచే ఆంగ్లియా ఇంటర్‌సిటీ రైళ్లో ఫస్ట్‌క్లాస్‌లో ప్రయాణించే వారికి వారాంతాల్లో ఉచితంగా స్నాక్స్, వాటర్ బాటిల్స్‌ను లండన్ రైల్ సంస్థ అందిస్తోంది.
మన దేశంలో మనం ప్రయాణించే ఏ రైలులో అయినా సరే.. స్లీపర్, ఏసీ క్లాసుల్లో మన భోజనాన్ని మనమే తెచ్చుకోవాలి. లేదా రైలులో అమ్మే భోజనం కొనుక్కోవాలి. ఇది సాధారణంగా ఎక్కడైనా జరిగే విషయమే. అయితే లండన్‌లోని ఆ రైళ్లలో వారాంతాల్లో ప్రయాణికులకు ఉచితంగా స్నాక్స్, తాగునీరు ఇస్తారట. అవును, షాకింగ్‌గా ఉన్నా ఇది నిజమే. గత కొన్ని సంవత్సరాలుగా వారు అక్కడ ఇలా చేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
లండన్ లోని నార్విన్ నుంచి లివర్‌పూల్ స్ట్రీట్ మధ్య నడిచే ఆంగ్లియా ఇంటర్‌సిటీ రైళ్లో ఫస్ట్‌క్లాస్‌లో ప్రయాణించే వారికి వారాంతాల్లో ఉచితంగా స్నాక్స్, వాటర్ బాటిల్స్‌ను లండన్ రైల్ సంస్థ అందిస్తోంది. అయితే దీన్ని ఆసరగా చేసుకుని గత కొంత కాలంగా ప్రయాణికులు ఇష్టం వచ్చినట్లు స్నాక్స్, వాటర్ బాటిల్స్‌ను తీసుకుంటున్నారట. దీంతో లండన్ రైల్ సంస్థకు నష్టం వస్తోందట. అయితే ఇలా ఉచితంగా అల్పాహారం, వాటర్ బాటిల్స్‌ను ఇవ్వడం ఈ మధ్యే మానేశారట. దీంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున లండన్ రైల్ సంస్థను విమర్శించారు.
అయితే ప్రయాణికుల నుంచి వస్తున్న నిరసనలను దృష్టిలో ఉంచుకుని లండన్ రైల్ సంస్థ తిరిగి అలా ఉచితంగా అల్పాహారం, వాటర్ బాటిల్స్‌ను ఇవ్వడం మొదలు పెట్టింది. కానీ.. వాటిని పొందాలంటే ప్రయాణికులకు ఆ సంస్థ ఒక కండిషన్ పెట్టింది. అదేమిటంటే.. మధ్యాహ్నం సమయంలో లంచ్ బాక్సులను తెచ్చుకునే ప్రయాణికులకే సాయంత్రం స్నాక్స్‌ను, వాటర్ బాటిల్స్‌ను ఉచితంగా ఇస్తామని లండన్ రైల్ సంస్థ తెలిపింది. ఎందుకంటే.. మధ్యాహ్నం లంచ్ చేస్తే సాయంత్రం స్నాక్స్ తక్కువగా తింటారట. అందుకని లండన్ రైల్ సంస్థ ఈ ఆలోచన చేసింది. ఏది ఏమైనా.. ఇప్పుడీ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..!