కుక్కలకు విశ్వాసం ఉంటుంది.. అవి ఒక్కసారి మనుషులను నమ్మితే చచ్చే వరకూ మనతోనే ఉంటాయి. ఈ బంధం కేవలం పెట్ లవర్స్‌కు మాత్రమే తెలుస్తుంది. ఎన్నోసార్లు కుక్కలు మనుషుల ప్రాణాలు కాపాడిన ఘటనలు మనం వినే ఉంటాం. తాజాగా ఎలుగబంటి దాటిలో గాయపడిన రైతును కుక్కులు కాపాడాయి. దావణగెరె జిల్లా జగలూరు తాలూకా బైరనాయకనహళ్లి (రాజనహట్టి) గ్రామ పొలంలో పని చేస్తుండగా గ్రామానికి చెందిన రైతు హనుమంతప్పపై నాలుగు ఎలుగుబంట్లు దాడి చేశాయి.
పొలానికి వెళ్లిన రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. ప్రస్తుతం రైతు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. హనమంతప్ప (52) గాయపడిన రైతు. దావణగెరె జిల్లా జగలూరు తాలూకా బైరనాయకనహళ్లి (రాజనహట్టి) గ్రామ పొలంలో పని చేస్తుండగా గ్రామానికి చెందిన రైతు హనుమంతప్పపై నాలుగు ఎలుగుబంట్లు దాడి చేశాయి. ఇది చూసిన కుక్కలు పెద్దగా అరుస్తూ ఎలుగుబంట్ల నుంచి రైతును కాపాడాయి. ఈ సంఘటన రంగయ్యకు చెందిన దుర్గా ఫారెస్ట్‌కు ఆనుకుని ఉన్న పొలంలో చోటుచేసుకుంది. ఈ ఘటన జగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది.
సమయానికి కుక్కలు రావడం వల్ల రైతు ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే ఎలుగుబంటి దాడిలో రైతు ప్రాణాలు కోల్పావాల్సి వచ్చేంది. ఏటా ఎలుగుబంటి దాడిలో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండేవాళ్లు ఈ ప్రమాదాల బారిన పడుతున్నాయి. రైతును కుక్కుల కాపాడిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ అవుతుంది.
దేశంలో ప్రతి చోటా ఏదో ఒక మూలన ఎలుగుబంటి దాడిలో రైతులు చనిపోతూనే ఉన్నారు. నాలుగు రోజుల క్రితం కూడా అనంతపురం జిల్లాలో ఓ పశువుల కాపారిపై ఎలుగుబంటి దాడి చేసింది. స్వల్పంగా గాయపడిన అతడిని స్థానికులు గమనించి రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎలుగుబంటి దాడికి ఎక్కువగా బలైపోతుంది గిరిపుత్రులే.. వాటి దాడి నుంచి కాపాడాలని ఎంత మొరపెట్టుకుంటున్నా..పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడంలో అధికారులు వైఫల్యం చెందుతున్నారు.